Lions trying to hunt Big Cat in Africa's Tanzania సింహాల గుంపు భీకర దాడి.. చిరుత ఎం చేసిందో తెలుసా.?

Amazing video lions trying to hunt leopard in africa s tanzania

cheetah, leopard, lions, lioness, Serengeti Reserve, Tanzania, South Africa, Pretended to die, Viral Video, Social media

This amazing video has come from the African country of Tanzania. Where a fierce fight was seen between the lion and the leopard in the Serengeti Reserve. A group of lions attacked the leopard. In which mostly lionesses were involved. The lioness tried a lot to hunt the leopard but she could not kill it and after that two lions reached there who attacked the leopard. The leopard also clashed with the lions and after that started pretending to die to save his life. He lay on the ground in a dead condition until the lions lost their interest in killing him.

ITEMVIDEOS: సింహాల గుంపు భీకర దాడి.. చిరుత ఎం చేసిందో తెలుసా.?

Posted: 09/01/2021 03:28 PM IST
Amazing video lions trying to hunt leopard in africa s tanzania

జాతి వైరం వున్న జీవులతో పాటు జీవనం కోసం జరిగే పోరాటంలో పలు జీవులు పోరాడుతూనే వుంటాయి. ఇలాంటి వీడీయోలనే కాదు నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనలను అనేకం మనకు తారసపడతాయి. పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి పోరాటాలు జాతివైరంతోనే. ఇలా జంతువులు పోట్లాడుకోవడమే కాదు జాతి వైరాన్ని మరచి స్నేహం చేసుకునే వీడియోలను కూడా మనం చూస్తూనే వుంటాం. అయితే జీవనం కోసం జరిగే వేటలో చిరుతలు జింకల వంటి వీడియోలను చూస్తూనే వుంటాం. అయితే చిరుతలు మహా తెలివైన జంతువులని ఇటీవల వైరల్ అయిన వీడియోలోనే మనం చూశాం.

ఓ జింక పిల్ల దారి తప్పి అడవిలో ఒంటిరిగా ఆహారాం అన్వేషణ చేస్తుండగా, అటుగా వచ్చిన చిరుత.. దానికి కనబబడకుండా దాక్కుని.. చెట్టును అడ్డం చేసుకుని నక్కిుతు జింక పిల్ల వరకు చేరుకుంటుంది. ఒక్కసారిగా సన్నధమైన తరువాత దానిపై దాడికి పాల్పడి.. దానిని ఆహారంగా చేసుకుంది. ఈ వీడియోలోనే చిరుత తెలివిగా వేటాటడాన్ని మనం చూశాం. అయితే ఒకవేళ చిరుతే అహారంగా మారాల్సిన సందర్భంలో ఎలా తెలివిగా వ్యవహరిస్తుంది.? అప్పుడు కూడా చిరుత తెలివిగానే తప్పించుకునే తరోణోపాయం చేస్తుందా లేక.. ఆహారంగా మారుతుందా.? అన్న అనుమానం రాగానే.. చిరుతలను కూడా వెంటాడి వేటాడే జంతువులు అడువుల్లో వున్నాయా.? అన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయా.?

అడవికి రాజైన సింహాలు చిరుతలతో పోరాడి వాటిని అహారంగా మార్చుకుంటాయి. మరి మీరెప్పుడైనా సింహం, చిరుత మధ్య పోరాటాన్ని చూశారా.? ఇలాంటివి అత్యంత అరుదుగా జరుగుతుంటాయి. అంతేకాకుండా సమవుజ్జీల మధ్య పోరు అత్యంత భయానకంగా ఉంటుందని చెప్పాలి. అలాంటి పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాప్రికాలోని  టాంజానియాలో ఇదే తరహాలో సింహాల గుంపు చిరుతను చుట్టుముట్టిన నేపథ్యంలో చిత్రీకరించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సెరెంగేటి రిజర్వులో సింహలు.. చిరుతపులి మధ్య భీకర పోరు కనిపించింది. సింహాల బృందం చిరుతపై దాడి చేసింది.

అడవిలోని నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. జీవన చక్రం ప్రకారం ఆకులు అలుములు తినే జంతువులు.. ఇతర జంతువులకు ఆహారాంగా మారుతుండగా, ఈ జంతువులు క్రూర మృగాలకు ఆహారంగా మారుతుంటాయన్న విషయం తెలిసిందే. అడవిలో వేటాడపోతే.. ఆహరం లేనట్టే. ఆకలితో అలమటించాల్సిందే. ఈ క్రమంలోనే చాలా జంతువులు క్రూరమృగాల చేతులకు చిక్కి శల్యం కావడం మనకు తెలిసిందే. అయితే అడవికి రారాజైన సింహం.. చిరుతను వేటాడితే ఎలా వుంటుంది. ఈ రెండు జీవులు అద్భుతమైన వేటగాళ్ళు.. తమకు ఆహారం కావాల్సిన సమయంలో వేగాన్ని, వ్యూహాన్ని అమలు చేస్తూంటాయి. అయితే తాజాగా ఓ సింహాల గుంపు చిరుతను తమ ఎరగా చేసుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో సింహాలు అన్నీ కూడా చిరుతను చుట్టుముట్టాయి. దాన్ని ఎరగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక సింహం నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు చిరుత నేల మీద దొర్లుతూ.. చనిపోయినట్లుగా నటిస్తుంది. అయితే పక్క నుంచి ఓ సింహం వచ్చి అకస్మాత్తుగా చిరుతపై దాడి చేస్తుంది. సింహాల నుంచి తప్పించుకునేందుకు చిరుత దాడుల్ని మూసుకుపోయాయి. తన ప్రాణాలు రక్షించుకునేందుకు అనేక సార్లు సింహలతో చిరుత పోరాడుతుంది. ఇక చివరికి చిరుత తాను చనిపోయినట్లుగా నటిస్తూ.. సింహాలను పక్కదారి పట్టించి తప్పించుకోవాలని భావిస్తుంది. ఈ షాకింగ్ వీడియోను వరల్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అండ్ విలేజ్ అనే యూట్యూబ్‌ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheetah  leopard  lions  lioness  Serengeti Reserve  Tanzania  South Africa  Pretended to die  Viral Video  Social media  

Other Articles