Rockets fired intercepted by anti-missile system అమెరికా సేనలే లక్ష్యంగా రాకెట్ల ప్రయోగం.. అడ్డుకున్న వ్యవస్థ

Rockets fired at kabul airport reportedly intercepted by anti missile system

Afghanistan, airport, anti-missile, Fired, intercepted, Kabul, Rockets, Gunfire, Salim Karwan, Kabul Airport, America

Rockets were fired toward the Kabul airport on Monday morning and were reportedly intercepted by a US anti-missile system. Other rockets appeared to have landed in a neighborhood outside the airport. It was unclear who launched the rockets. Gunfire followed the explosions in the Salim Karwan neighborhood.

కాబుల్ లో రాకెట్ల ప్రయోగం.. తిప్పికోట్టిన అమెరికా యాంటీ మిసైల్ వ్యవస్థ

Posted: 08/30/2021 01:15 PM IST
Rockets fired at kabul airport reportedly intercepted by anti missile system

అఫ్ఠనిస్తాన్ రాజధానిలోని కాబుల్ విమానాశ్రయం వద్ద నున్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులకు అగంతకులు పాల్పడ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన భారీ ఉగ్ర‌దాడిని మ‌ర‌వ‌క ముందే ఈ రోజు ఉద‌యం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది. కాగా, వాటిన అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థ నిర్వఘ్నంగా అడ్డుకోవడంలో సఫలీకృతం అయ్యింది. సోమవారం ఉదయం అమెరికా బలగాలను టార్గెట్ చేసుకుని అగంతకులు ఈ దాడులకు పాల్పడ్డారు. అగంతకులు సంధించిన రాకెట్లలో ఐదింటిని అమెరికా బలగాల యాంటి మిసైల్ వ్యవస్థతో అడ్డుకోగా, మరికోన్ని రాకెట్లు విమానా్రయం వెలుపల వున్న ప్రదేశంలో ల్యాండ్ అయ్యాయని సాక్షలు తెలిపారు.

రాకెట్ల ప్రయోగం అనంతరం సలీం కార్వాన్ పరిసర ప్రాంతాల్లో తుపాకీ పేలుళ్లు కూడా సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్ర‌వాదులు ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేశారని.. విమానాశ్రయంపై సంధించిన ఐదు రాకెట్లను యాంటీ మిసైల్ వ్యవస్థతో అడ్డుకున్నామని అమెరికా అధికారి తెలిపారు. ఈ రాకెట్ దాడుల వ‌ల్ల అక్క‌డ ప‌రిస‌రాలు పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్ పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. తాలిబాన్ నియంత్రణలో ఉన్న అప్ఠనిస్తాన్ నుండి అమెరికా సైన్యం వైదొలగడానికి ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందు ఈ రాకెట్ దాడి జరగడంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు బిడెన్‌కు వివరించామని వైట్ హౌస్ జెన్ సాకి ఒక ప్రకటనలో తెలిపారు.

అయినా అమెరికా సేనలు ఆద్యక్షుడి ఆదేశాలతో తమ కార్గో విమానాల్లో దేశం వీడి వెళ్తున్న అప్ఘన్ పౌరులను తరలిపింపును రెట్టింపు వేగంతో చేపట్టాయి. ఇదిలావుండగా కాబుల్ విమానాశ్రంలోని అమెరికా సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఖారోసన్ ఉగ్రవాద సంస్థ తరలిస్తున్న ఆత్మహుతి దాడుల బృందం వాహనాన్ని అమెరికా సైన్యం డ్రోన్లను ప్రయోగించి క్రితం రోజున పేల్చివేసిన విషయం తెలిసిందే. కాగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అనేక మంది అప్ఘన్ దేశ పౌరులతో పాటు పిల్లలు కూడా మరణించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  airport  anti-missile  Fired  intercepted  Kabul  Rockets  Gunfire  Salim Karwan  Kabul Airport  America  

Other Articles