అందివచ్చిన సాంకేతిక నేపథ్యంలో ఫోటో షూట్ కూడా సర్వసాధాణంగా మారిపోయింది. ఒకప్పుడు వేడుకలకు మాత్రమే జరిగే ఈ తంతు ఇప్పుడు అందుకోసమే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించేంత వరకు వెళ్లింది. పుట్టినరోజులకు, పెళ్లిళ్లకు ఫోటో షూట్ లో హడావిడి పెరిగింది. దీని కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఫోటోలో, సెల్ఫీలు దిగి వాటిని నెట్టింట్లో పెట్టి లైకుల కోసం కూడా నేటి యువత పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. ఇక ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఇక మోడళ్లు, సెలబ్రిటీల ఫోటో షూట్ కు డిమాండ్ పెరిగింది.
కొంత సాహసం, కొంత ధైర్యంతో కూడిన ఫోటోలు దిగడానికి కూడా వీరు సమ్మతిస్తున్నారు. ఇలా ఓ మోడల్ ఫోటో షూట్ కోసం ఏకంగా పెద్ద సాహసమే చేసి ప్రాణాలపైకి తెచ్చుకుంది. ఏకంగా చిరుత పులుల బోనులో దూరి.. ఫోటో షూట్ చేస్తుండగా అందులో వున్న రెండు చిరుతలు ఆమెపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలైన ఘటన జర్మనీలోని ప్రైవేటు ప్రాపర్టీలో ఫొటోషూట్ లో జరిగింది. జంతు ప్రేమికురాలిగా పాప్యులర్ అయిన జర్మనీ 36 ఏళ్ల మోడల్ జెస్సికా లేడాల్ఫ్‌పై ఫోటోషూట్ చేస్తుండగా చిరుతలు దాడి చేశాయి.
తూర్పు జర్మనీలోని నెబ్రాకు జెస్సికా చెందిన బిర్గిట్ స్టేచ్ అనే 48 ఏళ్ల మహిళ ఒక జంతువుల షెల్టర్ నడుపుతోంది. స్వతహాగా జంతు ట్రైనర్ అయినా ఆమె.. అడ్వర్టైజింగులకు, షోలలో కొన్నాళ్లు ఉపయోగించి ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేసిన జంతువులను బిర్గిట్ షెల్టర్‌లో పెంచుతుంది. అలా ఆమె దగ్గరకు ట్రాయ్, పారిస్ అనే రెండు చిరుతలు రాగావాటిని కూడా పెంచుతోంది. ఈ క్రమంలో చిరుతలు ఉన్న బోనులోకి వెళ్లిన జెస్సికా ఫొటోషూట్ ప్రారంభించింది. దీంతో కొంత సేపు నిమ్మకుండిన చిరుతలు ఒక్కసారిగా లేచి మోడల్ జెస్సికాపై దాడి చేశాయి. దీంతో ఆమెను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు.
చిరుతల దాడిలో తీవ్రంగా గాయపడిన జెస్సికాకు ప్రాణాపాయం మాత్రం లేదు. అయితే అమెకు తలపై, ముఖంపై, చేతులపై చిరుతలు దాడి చేశాయి. దీంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని.. ఆమె శరీరంపై గాట్లు ఇంకా తగ్గలేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై మోడల్ జెస్సికా మాట్లాడుతు..షూట్ జరిగే సమయంలో చిరుతల నా బుగ్గలు, చెవి, తలను కొరుకుతూనే ఉన్నాయి తాపీగా చెబుతోంది. కాగా..ఈ ఈ ఫొటోషూట్ ఎవరు నిర్వహించారు? అనేది తెలియరాలేదు. కానీ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. ప్రజలకు ఎటువంటి ఆందోళన పడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి చేసిన రెండు చిరుతలు కొన్ని వ్యాపార ప్రకటనల్లో కనిపించినట్లుగా సమాచారం.
(And get your daily news straight to your inbox)
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more
May 20 | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. వరుస వివాదాలతో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై... Read more