US Sends Drone After ISIS-K To Avenge Kabul Bombing అప్ఘన్ లోని ఐఎస్-కే స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం

U s launches strike on isis k as bombing s death toll soars

Joe Biden, American President, US, Taliban, Afghanistan Crisis, Pentagon, Kabul, Afghanistan, Kabul airport, ISIS-K, Afghanistan War, Airport security, US Military, ISIS, Islamic State, Hamid Karzai, Afghanistan-Taliban Crisis, afghan spies, afghanistan crisis, indians in afghanistan, Kabul, Kabul Airport, hindus in afghanistan

The U.S. military said on Friday night that it had launched its first reprisal strike for the devastating suicide bombing at Kabul’s airport the day before, using a drone to target and apparently kill a planner for the group that claimed responsibility for deadly suicide bomb attack at the Kabul airport.

అమెరికా ప్రతీకారం: అప్ఘన్ లోని ఐఎస్-కే స్థావరాలపై బాంబుల వర్షం

Posted: 08/28/2021 02:36 PM IST
U s launches strike on isis k as bombing s death toll soars

కాబూల్‌ విమానాశ్రయంలో పేలుళ్లు జరిపి అమాయక ప్రజలతో పాటు అమెరికా బలగాలను బలిగొన్న వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీచేసిన తరుణంలో తాము మాటలు చెప్పడమే కాదు.. చెప్పింది చేస్తామని కూడా అమెరికా చేసిచూపింది. తాలిబన్ల వశమైన అప్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. బాంబుదాడులతో విరుచుకుపడింది.

అప్ఘనిస్తాన్ లోని తమ ఇళ్లు-వాకిళ్లు వదిలి.. అస్తిపాస్తులు కాదనుకుని.. పిల్లాపాపలతో కలసి కట్టుబట్టలతో విదేశాలకు చేరుకునేందుకు కాబుల్ విమానాశ్రయానికి చేరిన అమాయక ప్రజలపై ఆత్మహుతి దాడులకు పాల్పడి ఏకంగా 200 మందిని బలిగొన్నవారిని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించిన విధంగానే వారిపై బాంబుదాడులు కురిపించారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా సైన్యానికి చెందిన పౌరులు కూడా వున్నారు. దీంతో వారిని బైడెన్ హీరోలుగా అభివర్ణించారు.

నాంగ్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా వాయుసేన ఈ మానవ రహిత వాయు దాడులకు దిగింది. లక్ష్యాన్ని ఛేదించినట్టు, పేలుళ్లకు సూత్రధారి హతమయ్యాడని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. ఈ దాడుల్లో పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు. కాగా, అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద అబే గేటు వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వీరిని హెచ్చరించిన మరుసటి రోజే అమెరికా వాయుసేన ఈ దాడులకు పాల్పడడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles