Bridge Collapses Into River in Uttarakhand రెండు వాహనాలతో జఖాన్ నదిలో కుప్పకూలిన వంతెన.!

Dehradun rishikesh bridge collapses road caves in as heavy rainfall lashes uttarakhand

Dehradun-Rishikesh bridge caves in, Dehradun-Rishikesh bridge collapses, Dehradun-Rishikesh bridge Uttarakhand, Uttarakhand disaster, Dehradun flood, Dehradun bridge collapse, Uttarakhand, Viral video, Trending video

The Dehradun-Rishikesh bridge collapsed near Rani Pokhari village as heavy rains continued to lash parts of Uttarakhand on Friday. A truck turned turtle and a few others remained stranded even as a river continued to flow under the broken bridge. The incident was captured on camera.

ITEMVIDEOS: రెండు వాహనాలతో జఖాన్ నదిలో కుప్పకూలిన వంతెన.!

Posted: 08/28/2021 01:39 PM IST
Dehradun rishikesh bridge collapses road caves in as heavy rainfall lashes uttarakhand

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్థంభింపజేస్తున్నాయి. లోత్తట్టు ప్రాంతాలు జలమయం కాగా, అనేక గ్రామాలకు పరిసర గ్రామాలు, పట్టణాలతో రవాణ సంబంధాలు తెగిపోయాయి. కుండపోత వర్షంతో అనేక ఇళ్లు నేలకూలడంతో ఎప్పుడోం జరుగుతుందోనని ప్రజలను వణికిపోతున్నారు. భారీ వానల కారణంగా నిన్న డెహ్రాడూన్‌లోని రాణీపోఖరి-రిషికేష్ జాతీయ రహదారిపై నిర్మించిన జఖాన్ నదిపై ఉన్న వంతెన అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది.

అదే సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వాహనాల్లోని ప్రయాణికులు భయంతో హడలిపోయారు. ప్రమాదాన్ని ముందే ఊహించిన కొందరు ప్రయాణికులు వాహనాలు దిగి పరుగున ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొన్ని వాహనాలు నదిలో పడి కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు (ఎస్‌డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించాయి. వంతెన కుప్పకూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్ తెలిపారు.

అలాగే, మాల్‌దేవ్‌తా-సహస్త్రధార లింక్ రోడ్డు లోనూ కొంత భాగం కొట్టుకుపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల కారణంగా తపోవన్ నుంచి మలేతా వెళ్లే జాతీయ రహదారి 58ని మూసివేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో రిషికేష్-దేవ్‌ప్రయాగ్, రిషికేష్-తేహ్రి, డెహ్రాడూన్-ముస్సోరి రోడ్లను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles