Bride refuses to enter wedding hall వేదిక ఎక్కకుండా అలిగిన వధువు.. ఎందుకో తెలుసా..

Desi bride refuses to enter wedding venue in viral video

Bride, bride refuse enter, bride perfect song, bride not enter venue song not played, bride angry, bride song, wedding song, wedding venue song, bride entry song, bride favorite song, trending Video, Instagram, The WeddingBrigade, viral video

A video has surfaced online showing the bride’s reaction shared by a wedding photography page on Instagram named “The WeddingBrigade" with a caption, “Watch the video to know why the bride didn’t want to enter the venue.”

ITEMVIDEOS: వేదిక ఎక్కకుండా అలిగిన వధువు.. ఎందుకో తెలుసా..

Posted: 08/25/2021 01:22 PM IST
Desi bride refuses to enter wedding venue in viral video

పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పట్లు, తాళాల, తళంబ్రాలు మూడే ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఒక ఫేమస్ పాట ఉంది గుర్తుందా? అది అప్పటి పాటే కాదు.. పెళ్లితో ఏకమవుతున్న జంట మనస్సులోత్తులో కదిలాడే భావం.. బంధం.. కూడా. ఆ రోజుల్లో పెళ్లి మండపంలోకి వధువు రావాలంటే.. తన సోదరులో లేక మేనమామలో గంపలో కూర్చోబెట్టుకుని ఎత్తుకుని తీసుకువచ్చేవారు. అదీ కాకపోతే పెళ్లి కూతురు తన స్నేహితులతో కలసి పెళ్లిమండపానికి వస్తుంది. కానీ మారుతున్న కాలంతో పాటు అన్ని మారుతున్నాయి. ఇప్పుటి తరం వధూవరులకు పెళ్లంటే సంగీత్.. తరువాత పెళ్లి మండపంలోకి ఎంట్రీ సాంగ్.. ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు.

ఇక పెళ్లికూతురు ఏదైనా విషయంలో అలిగితే.. అమ్మో.. ఒకరి తరువాత ఒకరు వచ్చి అలకకు కారణాలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి హుటాహుటిన కదులుతారు. ఇక వదువుగా వున్నవాళ్లు చిన్న చిన్న విష‌యాల‌కు కూడా అలుగుతుంటారు. బాధ‌ప‌డుతుంటారు. మొహం మాడ్చుకుంటారు. ఎవ్వ‌రితో మాట్లాడ‌రు. త‌మ‌లో తామే బాధ‌ప‌డ‌తారు. కొంత సేప‌టి త‌ర్వాత మ‌ళ్లీ న‌వ్వు ముఖం పెడ‌తారు.  ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయే పెళ్లి కూతురు కూడా అటువంటి ల‌క్ష‌ణాలు ఉన్న అమ్మాయే. ఎందుకంటే.. ఓవైపు తన పెళ్లి జ‌రుగుతుంటే.. పెళ్లి కోసం అతిథులు వ‌చ్చాక‌.. పెళ్లి కొడుకు.. పెళ్లిమండ‌పం మీద త‌న కోసం వెయిట్ చేస్తుంటే.. నేను పెళ్లి మండ‌పం ఎక్క‌ను.. అంటూ మారాం చేసింది. అలిగింది. దీంతో పెళ్లికి వ‌చ్చిన వాళ్లు షాక్ అయిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఎందుక‌మ్మా.. ఎందుకు పెళ్లిమండ‌పం ఎక్క‌డం లేదు? ఏమైంది.. అని బంధువులు ఆరా తీయ‌గా.. పెళ్లి కూతురుగా నేను ఎంట్రీ ఇస్తున్న‌ప్పుడు.. నేను చెప్పిన పాట‌ను ప్లే చేయ‌లేదు ఎందుకు? అంటూ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్‌తో గొడ‌వేసుకుంది పెళ్లి కూతురు. నేను ముందే చెప్పాను క‌దా.. ఆ పాట ప్లే చేయ‌మ‌ని. నేను పెళ్లి చేసుకోనుపో. నేను అస‌లు పెళ్లిమండ‌ప‌మే ఎక్క‌ను.. అంటూ అంద‌రినీ ఇబ్బంది పెట్టింది ఆ పెళ్లికూతురు. చివ‌ర‌కు త‌న కుటుంబ స‌భ్యులు.. త‌నను ఓదార్చ‌డంతో ఒక చిరున‌వ్వు న‌వ్వి.. పెళ్లి పీట‌లు మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ది వెడ్డింగ్ బ్రిగేడ్ (The Wedding Brigade) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. నెటిజ‌న్లు అయితే.. ఆ వీడియోను చూసి న‌వ్వ‌లేక చ‌చ్చిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles