Court dismisses Meera Mithun's bail petitions నటి మీరా మిథున్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు

Petition filed in court to arrest meera mithun in yet another case

sam abhishek, Meera Mithun Video, Meera Mithun latest, Meera Mithun arrest, meera mithun, Actress Meera Mithun

The Chennai Sessions Court has dismissed actor Meera Mithun's bail petitions for her derogatory comments on a particular caste in one of her videos. Various organizations blamed the actress for her comment, and have lodged police complaints against her.

నటి మీరా మిథున్ కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

Posted: 08/24/2021 04:54 PM IST
Petition filed in court to arrest meera mithun in yet another case

హీరోయిన్ మీరా మిథున్ కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. తాను న్యాయస్థానం షరతులకు లోబడి వుంటానని, సాక్షులను, సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయనని అమె న్యాయస్థానానికి విన్నవించినా వారం రోజులే అవుతున్న తరుణంలో అమె దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దళిత నటీనటులు, దర్శకులను సినీపరిశ్రమ నుంచి తరమివేయాలని అమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి, వీరివల్ల తనకు సినీ అవకాశాలు దెబ్బ తిన్నాయని... సినీ పరిశ్రమ నుంచి దళితులను తరిమికొట్టాలని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దళిత దర్శకులు తీస్తున్న సినిమాల వల్ల చిత్ర పరిశ్రమ విలువ తగ్గిపోతోందని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో ఆమెపై వీసీకే పార్టీ నేత వన్నియరసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ సామ్ అభిషేక్ తో పాటు కేరళకు పారిపోయింది. అయితే ఆమె ఆచూకీని తెలుసుకున్న పోలీసులు కేరళకు వెళ్లి, అమెను అమె బాయ్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీంతో అరెస్టెయిన వారం రోజులకు అమె తరపున అమె న్యాయవాది అమెకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం అమె జుడీషియల్ రిమాండ్ విధించిన స్వల్ప కాలమే అవుతున్నందున బెయిల్ ఇచ్చేందుకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిరాకరించింది.

అయితే బెయిల్ పిటీషన్ లో మాత్రం నటి మీరామిథున్ తన తప్పును అంగీకరించింది. తాను తప్పు చేశానని అంగీకరిస్తూనే బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. న్యాయస్థానం షరతులకు లోబడి మసలుకుంటానని, సాక్షులను, సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయనని అమె న్యాయస్థానానికి విన్నవించారు. తాను పలు సినిమాలలో షూటింగ్ కోసం కాల్ షీట్స్ ఇచ్చానని, అందుకని తనకు బెయిల్ మంజూరు చేయాలని అమె కోరారు. అయితే అమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించి వారం రోజులే అవుతున్న తరుణంలో అమె దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles