Earthquake in Bay of Bengal; tremors felt in Chennai బంగాళాఖాతంలో భూకంపం... చెన్నైలో ప్రకంపనలు..

Chennai feels mild tremors as 5 1 magnitude earthquake hits bay of bengal

Chennai, Chennai earthquake, Chennai news, Tamil Nadu earthquake, earthquake today chennai 2021, earthquake andhra pradesh, Bay of Bengal earthquake

An earthquake measuring 5.1 on the Richter scale sent tremors across parts of Tamil Nadu, including Chennai, at noon. The National Centre for Seismology identified the epicentre located off the Tamil Nadu and Andhra Pradesh coasts at a 10 km depth in the Bay of Bengal

బంగాళాఖాతంలో భూకంపం... చెన్నైలో ప్రకంపనలు..

Posted: 08/24/2021 03:58 PM IST
Chennai feels mild tremors as 5 1 magnitude earthquake hits bay of bengal

బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపకేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది.

ఇవాళ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని వివరించింది. ఏపీలోని కాకినాడకు దక్షిణ-ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రికి దక్షిణ-ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ తెలిపింది. ఇది అతి తీవ్ర స్థాయిలో నమోదైందని కూడా తెలిపారు.

దీని ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప ప్రభావం నేపథ్యంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. అటు, ఏపీలోనూ పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles