CBI announces Rs 5 lakh reward in YS Viveka case వైఎస్ వివేకా హత్యకేసులో చర్చనీయాంశంగా మారిన సీబిఐ ప్రకటన.!

Cbi announces rs 5 lakh reward in ys vivekananada reddy case

CBI, murder case, Vivekananda, Rangaiah, servent, Weapons, Sunil Kumar Yadav, Financial grudge, Bank staff, Revenue Employees, CBI officials, Kadapa Central Jail, Murder case, CBI custody, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

CBI officials announced a reward of Rs 5 lakh for anyone sharing information of importance regarding the brutal murder of YS Vivekananda Reddy. CBI officials gave a paper statement after 77 days rewarding Rs 5 lakh for those who gave valuable information regarding the murder of Vivekananda Reddy.

వైఎస్ వివేకా హత్యకేసులో చర్చనీయాంశంగా మారిన సీబిఐ ప్రకటన.!

Posted: 08/21/2021 03:40 PM IST
Cbi announces rs 5 lakh reward in ys vivekananada reddy case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఓ వైపు అరెస్టు పర్వం కొనసాగిస్తున్న సీబీఐ.. మరోవైపు కేసులో వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. వైఎస్ వివేకా కేసులో విచారణ వేగవంతం చేసిందని అంతా భావిస్తున్న తరుణంలో సీబిఐ విడుదల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దాదాపు 77 రోజులుగా విచారించిన తరువాత ఈ కేసులో కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్న సీబిఐ.. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకువస్తుందని అంతా భావించారు. అయితే ఇంత చేసిన సీబిఐ తాజాగా విడుదల చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రకటనతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే అరెస్టయిన వారికి శిక్ష పడే విషయమై కూడా నీలినీడలు అలుముకున్నాయి. ఈ హత్యకేసులో ఇదివరకే అరెస్టయిన సునీల్ కుమార్ యాదవ్ తరువాత మిగత అరెస్టులు వుంటాయని అంతా భావిస్తున్న తరుణంలో సీబిఐ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తులను కూడా విచారించింది. దీంతో ఈ కేసులో ఉన్న పెద్ద తలలను కూడా అరెస్టు చేస్తోందని అనుకున్నారు. కానీ సీబిఐ తాజాగా ఈ కేసులో ఓ ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.

వివేకానంద రెడ్డి హత్యకేసులో నేరానికి సంబంధించిన నమ్మకమైన సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles