toddler ramp walk goes viral online ఈ చిన్నారి ర్యాంప్ వాక్ కు నెటిజనులు ఫిదా..

This toddler walks the ramp like a boss video goes viral on net

little girl video, little girl ramp vdeo, little giel viral video, toddler on ramp, girl viral video, girl trending video, Abrianna, Kristen Weaver, Photographer, TikTok, 18 million views, angel, World’s Perfect Toddler, Instagram, 44k views, viral video, Trending video

An adorable video that has surfaced on social media features a little girl walking the ramp like a boss, no kidding. The video was shared by Photographer Kristen Weaver. The video went insanely viral online after she shared it on TikTok.

ITEMVIDEOS: ఈ చిన్నారి ర్యాంప్ వాక్ కు నెటిజనులు ఫిదా..

Posted: 08/20/2021 06:35 PM IST
This toddler walks the ramp like a boss video goes viral on net

ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.? అంటారు మన పెద్దలు. చిన్నారులకు ఏది చూపిస్తే.. అదే చేస్తారు. ఎంతలా అంటే తమకు అంతా తెలుసు అనేంతలా. మన ఇళ్లలో చిన్నారులు ఏదైనా కాళ్లకు అంటుకోగానే నేరుగా వెళ్లి కాళ్లు కడుక్కుంటారు. ఇక ఏదైనా తమ చేతుల్లోంచి జారి కిందపడితే వెంటనే వెళ్లి దానిని తుడిచేస్తారు. ఇది ఇంటివరకు మాత్రమే అనుకుంటే పొరబాటే. తనకన్నా పెద్దైన వాళ్లు ఇంట్లో వుంటే వారి పుస్తకాలలో తమకు తెలుసు అన్నట్లుగా రాసేస్తారు. ఇలాగే ఓ ఫోటోగ్రాఫర్ తన కూతర్ని నిత్యం తన వెంట తీసుకెళ్లి ఫ్యాషన్ షోలలో ఫోటోలను తీసేంది.

అయితే ఇకనేం అమె అక్కడ తన తల్లి తీసే ఫోటోలకన్నా ర్యాంపుపై హోయలోలుకబోస్తూ క్యాట్ వాక్ చేసే మోడళ్లను తీక్షణంగా చూసేది. వారు ర్యాంపుపై అడుగుపెట్టడంతోనే జిల్లు జిగేలు మనే వెలుతురు కాంతులు, వారు నడుస్తున్నంత సేపు చప్పట్లు.. ఆ డిజైన్ బాగుందని కామెంట్లు అన్ని చూసిన చిన్నారి.. వాళ్లు ఏం చేస్తారో.. ఎలా నడుస్తారు.. నడిచేప్పుడు చేతులెక్కడ పెట్టుకుంటారు.. వారు ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తారు.. అన్నీ గమనించింది. ర్యాంప్ వై వచ్చేప్పుడు ఎలా చేస్తారు.. తిరిగి వెళ్లేప్పుడు ఎలా చేస్తారు.? అంతా తీక్షణంగా పరీక్షిందింది.

అలాంటిది అమెకు కూడా ఓ ర్యాంపు షోపై నడిచే అవకాశం వచ్చింది. దీంతో అమె సైపర్ మోడళ్లను అన్వయించింది. ఎందరో మోడళ్లను తలదన్నేలా ర్యాంప్ వాక్ చేసింది. ఇప్పుడమె వీడియో టిక్ టాక్ లో సంచలనం రేపగా, తాజాగా సామాజిక మాద్యమం ఇన్ స్టాగ్రామ్ లోనూ వరల్ గా మారింది. అబ్రియానా అనే ఓ చిన్నారి పింక్ గౌన్ ధరించి ర్యాంప్ మీద హొయలు పోతూ వాక్ చేయడం.. మోడళ్ల తరహాలోనే తన డ్రెస్ ప్రదర్శించడం.. పైగా ప్రొఫెషనల్ మోడళ్ల వాకింగ్ లో ఉండే మెరుపులు, విరుపులు అబ్బో అన్నీ ఈ బుజ్జిదాని వాకింగ్ లో చూపించేసింది.

చూసేందుకు ముద్దుముద్దుగా ఉంటూనే ఓ ప్రొఫెషనల్ మోడల్ ను తలపించేలా వాకింగ్ చేసిన ఈ చిన్నారి వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్నారి ఈ క్యూట్ వాకింగ్ ను ఇప్పటి వరకు టిక్ టాక్ లో ఏకంగా 18 మిలియన్ల మంది వీక్షించారు. కాగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా ఇప్పటికే ఏకంగా 50 వేల మందికి పైగా వీక్షించారు. దీంతో ఫోటోగ్రాఫర్ క్రిస్టీన్ వీవర్.. అబ్రియానా తన లిటిల్ ఏంజిల్ అని పేర్కోంది. ఈ వీడియో వీక్షలను అలరిస్తోందని, అనేక మంది అబ్రియానా వీడియోను షేర్ ఛేసుకుంటున్నారని తెలిపింది. అబ్రియానా ప్రపంచ ఫర్ ఫెక్ట్ చిన్నారి అంటూ కూడా కొనియాడింది.

 
 
 
View this post on Instagram

A post shared by Kristen Weaver (@kristenweaverstudio)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles