Union minister kicks up row with remarks on Tagore's complexion ఠాగూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్రమంత్రిపై భగ్గుమన్న మేథావులు

Union minister comments on rabindranath tagore s complexion kicks up row

Union Education Minister, Subhas Sarkar, Trinamool Congress, Rabindranath Tagore, BJP West Bengal, TMC West Bengal, Kolkata news, West Bengal

Union Minister Subhas Sarkar courted a controversy on Wednesday with his remarks that Nobel laureate Rabindranath Tagore's mother did not cradle him in her arms when he was a child because of his "not so fair complexion", provoking angry reactions from West Bengal's ruling TMC, which said it was an "insult" to a state icon.

విశ్వకవి ఠాగూర్ పై నోరుజారీన కేంద్రమంత్రి.. అగ్గిరాజేసిన వ్యాఖ్యలు..

Posted: 08/19/2021 08:53 PM IST
Union minister comments on rabindranath tagore s complexion kicks up row

ఎక్కడో విదేశాల్లో మాత్రమే కనిపించే వర్ణ విభేధాలకు ఇప్పుడు భారత్ కూడా వేదికగా నిలుస్తోంది. ఏకంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ ఆయన వర్ణంతో అవమానించే చర్యలకు స్వయంగా కేంద్ర మంత్రి పూనుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇదివరకు కూడా ఓ కేంద్రమంత్రి ఇటువంటి తరహా వ్యాఖ్యలే ఉత్తర, దక్షిణ భారతావని ప్రజల మధ్య చిచ్చురగిల్చేలా వర్ణంతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీని సందర్శించిన ఆయన అక్కడే ఈ వివాదానికి తేరలేపారు.

విశ్వవిద్యాలయ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతు.. రవీంద్ర ఠాగూర్ నల్లగా ఉండటంతో తల్లి ఆయన్ని పట్టించుకునేవారు కాదని వివక్ష చూపేవారని..తల్లితో సహా ఆయన కుటుంబంలో అందరి నిరాదరణకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ఠాగూర్ నల్లగా ఉండటం వల్ల తల్లి ఆయన్ని ఎప్పుడూ కొడుకుగా ముద్దు చేయలేదని..తల్లే కాకుండా ఆయన బంధువులు కూడా ఆయన్ని పట్టించుకునేవారు కాదని నల్లగా ఉండటం వల్ల వివక్ష చూపారని అన్నారు. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన్ని చేతుల్లోకి తీసుకోలేదని ఆదరంగా ఒడిలో కూర్చోబెట్టుకోవటం వంటివి చేసేవారు కాదని అన్నారు.

తన కుటుంబంలోని మిగతా వారి కంటే ఠాగూర్ నల్లగా ఉండేవారు. పసుపు రంగులో మెరిసిపోయేవారు కొందరుంటే..ఇంకొందరు ముదురు రంగులో ఉండేవారు.. విశ్వకవి రెండో వర్గానికి చెందినవారు. అని అన్నారు. విశ్వకవిగా పేరొందిని రవీంద్రుడు కుటుంబంలోనే వివక్షను ఎదుర్కొన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మేధావులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అటు రాజకీయంగానూ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా శాఖ మంత్రి అజ్ఞ‌ానానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. భారతీ సాహిత్యానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన రవీంద్రుడి రంగుపై ఇటువంటి వ్యాఖ్యలు విద్యాశాఖామంత్రి బాధ్యతల్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయటంపై మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rabindranath Tagore  Union Education Minister  subhas sarkar  complexion  TMC  BJP  West Bengal  Politics  

Other Articles