Forced sex in marriage not illegal, says Mumbai Court భర్త బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేం: ముంబై కోర్టు

Forced sex in marriage cannot call it illegal says mumbai court grants bail to accused husband

Marital sex, sex against will, Marital rape, Mumbai Additional Sessions court, judge Sanjashree J Gharat, forced sex, Mumbai, Maharashtra, crime

A Mumbai court observed that forced sex in a marriage can't be called illegal. While hearing the grievance of a woman who reportedly suffered paralysis due to forcible sex by her husband, Mumbai Additional Sessions judge Sanjashree J Gharat said that the man cannot be held responsible for the same.

భర్త బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేం: ముంబై కోర్టు

Posted: 08/14/2021 02:48 PM IST
Forced sex in marriage cannot call it illegal says mumbai court grants bail to accused husband

భార్యకు సమ్మతం లేకుండా.. అమెతో బలవంతంగా శృంగారం జరపడం చట్ట విరుద్ధమా ? అంటే దీనిపై భారత హిందూ వివాహిక చట్టంలో మాత్రం స్పష్టత కొరవడింది. ఈ విషయంలో కొన్ని న్యాయస్థానాలు అది నేరంగా పరిగణించగా, మరికొన్ని న్యాయస్థానాలు మాత్రం దానిని చట్టవిరుద్దం కాదని అంటున్నాయి. భర్తను కూడా అమె సమ్మతం లేకుండా తాకే హక్కు కూడా భర్తలకు లేదని పలు కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు తీర్పులను వెలువరించాయి. అయితే అదే సమయంలో ఇదే తరహా కేసులలో భర్తలది తప్పు అని చెప్పలేమని మరికొన్ని న్యాయస్థానాలు తీర్పులను వెలువరించాయి.

భార్యలను భర్తలు బలవంతం పెట్టడం సరికాదా ? లేదా భార్తల చేతిలో భార్యలు బలవంతపు శృంగారానికి గురికావాల్సిందేనా.? అన్న విషయంలో పలు కోర్టులు తీర్పులను వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే…తాజాగా..ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు విరుద్ధమైన తీర్పునివ్వడంపై హాట్ హాట్ చర్చలు ప్రారంభమయ్యాయి. తనకిష్టం లేకుండా..శృంగారం జరుపుతున్నాడని ఓ భార్య..భర్తపై కంప్లైట్ చేసింది. చివరకు ఇది కోర్టు మెట్లు ఎక్కింది. బలవంతపు శృంగారం ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదని..ఆమెతో శృంగారంలో పాల్గొన్నది భర్తే కావడం వల్ల…చట్టం ముందు నిలబడదని చెప్పింది.

మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత..గత నవంబర్ 22న పైళ్లైంది. వివాహామైన కొన్ని రోజులకే అత్తింటి వారు అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా..తనపై ఆంక్షలను కూడా విధించారని చెప్పుకొచ్చారు. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత…తన ఇష్టానికి వ్యతిరేకంగా…భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నారని, జనవరి నెలలో ఓ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కూడా…బలవంతంగా శృంగారం చేశాడని ఆరోపించారు. అప్పటి నుంచి తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, వైద్యులను సంప్రదిస్తే..తన నడుం కింది భాగం పక్షవాతానికి గురైందని వారు వెల్లడించారని వివాహిత పేర్కొన్నారు.

భర్త వల్లే తనకు ఈ సమస్య వచ్చిందంటూ..సదరు మహిళ…పోలీసులకు ఫిర్యాదు చేసారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ…అడిషనల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు అత్తామామలు. వరకట్నం కోసం తాము ఎప్పుడూ వేధించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు జడ్జీ సంజశ్రీ ఘరాత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురి కావడం బాధకరమే అయినా..దీనికి భర్తే కారణమని చెప్పడం సరైంది కాదన్నారు. పెళ్లి తర్వాత…భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా…అది చట్ట విరుద్ధం కాదని వెల్లడించారు. అదనపు కట్నం కోసం వేధించారన్న చెబుతున్న మహిళ..ఎంత డిమాండ్ చేశారనే విషయం వెల్లడించడం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marital sex  sex against will  Marital rape  Mumbai court  forced sex  Mumbai  Maharashtra  crime  

Other Articles