reopening of schools soon is a must: Parliamentary panel ‘జూ’లొ తలపడ్డ రెండు కుటుంబాలు,, రాత్రి అనుసరించిన వన్యమృగాలు..

Humans fight at beijing wildlife park setting the wrong example for the animals

wild humans fight at beijing zoo, beijing wildlife park, chinese social media, altercation between two families, verbal fight turns physical, daxing district, Beijing, daxing district, china animals, altercation, fight between two families, Weibo trending, viral video, Twitter, social media, china

A fight between visitors of the Beijing Wildlife Park has gone viral on Chinese social media. The altercation happened on the afternoon of August 7 at the Wildlife Park in the Daxing District. According to the We Chat account of the Beijing Wildlife Park, the fight erupted after two visitors had a dispute over something trivial. Their clash initially was only a verbal one, but soon turned physical.

ITEMVIDEOS: ‘జూ’లొ తలపడ్డ రెండు కుటుంబాలు,, రాత్రి అనుసరించిన వన్యమృగాలు..

Posted: 08/10/2021 05:17 PM IST
Humans fight at beijing wildlife park setting the wrong example for the animals

ఒక్కోసారి మనిషి ఒకటి తలుస్తాడు.. కానీ దైవం మరోటి తలుస్తాడు. సరదాగా వన్యమృగాలను వీక్షించి.. అక్కడ కొద్ది సేపు సేద తీరి వద్దామనుకుని వెళ్లిన రెండు వేర్వేరు కుటుంబాలు.. జూలో చేసిన పని చూసి అందులో ఉండే వన్యమృగాలు కూడా అచ్చంగా ఈ రెండు కుటుంబాలకు చెందిన మనుషులు వ్యవహరిచిన తీరునే ప్రవర్తించాయట. ఇక వాటిని అలా చేయకూడదు అని చెప్పడానికి జూ సిబ్బందికి తలకుమించిన పనైంది. ఔనా.. ఇంతకీ జూలోని వన్యమృగాలను చూసేందుకు వచ్చిన ఆ రెండు కుటుంబాలు ఏం చేశాయి.? అనేగా మీ సందేహం..

ఆలస్యం లేకుండా మ్యాటర్ లోకి ఎంటరైతే.. జూ సందర్శనకు వచ్చిన పర్యాటకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. చివరికి రెండు కుటుంబాలు కలబడ్డాయి.. కిందపడి కొట్టుకున్నాయి. జుట్లు చేతబట్టి లాక్కున్నాయి. బట్టలను చింపుకున్నాయి. చెంపదెబ్బలు కొట్టుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లోని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూ సందర్శనలో పర్యాటకులు బిజీగా ఉన్న వేళ ఇద్దరి మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. అది క్రమంగా ఇరు కుటుంబాలు కలబడే స్థాయికి వెళ్లింది. ఇరు వర్గాల్లోని మహిళలు జుట్లు పట్టుకుని నేలపై పడి కొట్టుకున్నారు.

చేతిలో చంటి బిడ్డతో ఉన్న ఓ మహిళ నేల మీద పడివున్న మహిళ జుట్టు పట్టుకుని లాగుతుండగా, మరో వ్యక్తి వచ్చి చంటి పిల్లాడితో ఉన్న మహిళను బలంగా కడుపులోతన్నాడు. దీంతో ఆమె అల్లంత దూరంలో ఎగిరిపడింది. గొడవ చల్లారకపోగా, మరింత పెద్దది అవుతుండడంతో కల్పించుకున్న జూ సిబ్బంది ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేశారు. వీరి గొడవను జంతువులు కూడా చూస్తూ ఉండిపోయాయని, రాత్రివేళ అవి కూడా మనుషులను అనుకరిస్తూ గొడవకు దిగుతున్నాయని జూ యాజమాన్యం పేర్కొనడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles