Pentagon on Lockdown After Shooting Near Metro Station అమెరికా పెంటగాన్ వద్ద కాల్పుల కలకలం.. లౌక్ డౌన్ అమలు..

Avoid the area pentagon locked down after multiple gunshots at metro station

Pentagon, Pentagon shooting, Pentagon metro station, Pentagon locked down, gunshots at pentagon, pentagon firing incident, pentagon news, pentagon lockdown, gunshots at pentagon, pentagon on lockdown, shooting near metro station, shots fired at pentagon, multiple shots fired, United States, Milatary Head Quarter, Pentagon, shooting, Pentagon metro station, firing, US, America, Crime

The Pentagon was on lockdown Tuesday after reports of a shooting at a subway station just outside the secure US military headquarters. Employees in the US Defense Department headquarters in the Arlington suburb of Washington were ordered to shelter in place amid reports of several gunshots and possible injuries in the station, the entrance of which is just a few dozen yards (meters) from the building's main doors.

అమెరికా పెంటగాన్ వద్ద కాల్పుల కలకలం.. లౌక్ డౌన్ అమలు..

Posted: 08/03/2021 10:16 PM IST
Avoid the area pentagon locked down after multiple gunshots at metro station

 అగ్రరాజ్యం అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వద్ద తుపాకీ కాల్పుల కలకలం రేగింది. పెంటగాన్ సమీపంలోని మెట్రో రైల్వేస్టేషన్ లో తుపాకీ కాల్పుల శబ్దాలు పలుమార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో వేగంగా స్పందించిన ఆర్మీ అధికారులు అగ్రరాజ్య మిలటరీ ప్రధాన కార్యాలయాల వద్ద లాక్ డౌన్ విధించారు. వాషింగ్టన్ శివారు ప్రాంతమైన అర్లింగ్టన్ వద్దనున్న పెంటగాన్ ప్రధాన కార్యాలయానికి ప్రతి రోజు వేల సంఖ్యలో ఉద్యోగులు వస్తుంటారు. వారందరి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన డజన్ల అడుగుల దూరంలోని మెట్రోస్టేషన్ లో కాల్పులు కలకలం రేపాయి.

అయితే కాల్పుల నేపథ్యంలో ఉద్యోగులతో పాటు స్టేషన్లో వున్నవారందరూ ఎక్కడి వారు అక్కడే తలదాచుకోవాలని కోరిన అధికారులు హుటాహుటిన స్పందించిన లాక్ డౌన్ విధించారు. స్టేషన్ లోని ప్రయాణికులతో పాటు ఉద్యోగులు సురక్షితంగా ఆ ప్రాంతాన్ని వీడాలని కూడా అధికారులు కోరారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగి ప్రయాణికులను తరలిస్తున్నాయి. మెట్రో బస్ ఫ్లాట్ ఫాం వద్ద గుర్తు తెలియని వక్తులు పలు రౌండ్ల కాల్పులకు తెగబడినట్లు సమాచారం.

ఈ ఘటనపై పెంటగాన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతినిధి క్రిస్ లేమన్ మాట్లాడుతూ..కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పాడు. ఆ ప్రాంతం గుండా ప్రయాణించవద్దని ప్రజలను ఆయన హెచ్చరించాడు. అయితే కాల్పులకు గల కారణాలు ఏమిటీ..? ఎవరు కాల్పులు జరిపారు.. ఈ కాల్పుల్లో ఎంతమంది గాయాలపాలయ్యారు.? అన్న వివరాలు తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇది ఉగ్రవాద చర్య అన్న విషయమై కూడా క్లారిటీ రావాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : United States  Milatary Head Quarter  Pentagon  shooting  Pentagon metro station  firing  US  America  Crime  

Other Articles