Mars' buried polar 'lakes' may just be frozen clay అంగారకుడిపై నీళ్లుండే అవకాశమే లేదు: నాసా శాస్త్రవేత్తలు

Clays not water are likely source of mars lakes

Earth, Mars, European Space Agency, Mars Express orbiter, south pole, Red Planet, Radar, Water, Clay, NASA

In 2018, the radar onboard the European Space Agency’s Mars Express orbiter was announced to have found evidence of lakes of salt water underneath the ice at the south pole of the Red Planet.

అంగారకుడిపై నీళ్లుండే అవకాశమే లేదు: నాసా శాస్త్రవేత్తలు

Posted: 08/03/2021 09:21 PM IST
Clays not water are likely source of mars lakes

అంగారకుడి మీద జీవం గుట్టును తెలుసుకునేందుకు ఇప్పుడు పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నీటి జాడను పసిగట్టేందుకు శాస్త్రవేత్తలు అనునిత్యం కృషి చేస్తున్నారు. నీళ్లున్నాయని ఎంతో కాలంగా చెబుతూ వస్తున్నారు. తాజాగా గత నెలలో అరుణ గ్రహం దక్షిణ ధ్రువం వద్ద కొన్ని కొలనులున్నట్టు గుర్తించారు. నీటి జాడలున్నాయని నిర్ధారించారు. అయితే, అవి నీళ్లు కాదని తాజాగా నాసాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు తేల్చారు. మార్స్ సబ్ సర్ఫేస్ లో నీళ్లను గుర్తించినట్టు ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త 2018లో ప్రకటించారు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మార్స్ ఎక్స్ ప్రెస్ ఆర్బిటర్ లోని రాడార్ గుర్తించిన ఆనవాళ్ల ప్రకారం అవి నీటి జాడలని పేర్కొన్నారు. దీంతో సంచలనకరంగా మారిన విషయమై తాజాగా పరిశోధన సాగింది. రాడర్ ఆనవాళ్లను పరిశీలించిన నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు.. అవి నీటి జాడలు కావని.. బహుశా మట్టి జాడలు అయిఉంటాయని తేల్చారు. అతి శీతలమైన ల్యాబ్ లో వారు పరిశోధన చేశారు. మార్స్ పై ఉన్న ఆ సరస్సులన్నీ అతి శీతలమైన ప్రాంతాల్లోనే ఉన్నాయని, కాబట్టి అక్కడ నీరు ద్రవరూపంలో ఉండే అవకాశమే లేదని నిర్ధారించారు.

ఆదిత్య ఆర్. ఖుల్లర్, జెఫ్రీ జె. ప్లాట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దాదాపు 44 వేల రాడార్ శబ్దాలను విశ్లేషించారు. అంగారకుడి ఉపరితలానికి అతి సమీపంలో రాడార్లు పంపించిన సిగ్నళ్లు నీటికి సంబంధించినవి కాదని గుర్తించారు. అక్కడ నీరు గడ్డకట్టిన స్థితిలోనే ఉంటుందని, బహుశా రాడార్లు గుర్తించింది మట్టివేమోనని కంప్యూటర్ మోడల్స్ ద్వారా నిర్ధారించారు. ఎత్తైన కొండల నుంచి ఇసుక, గులక రాళ్లు కిందకు వచ్చి ఉంటాయని తేల్చారు. అయితే, రాడార్ సిగ్నళ్లు ఏంటన్నది ప్రస్తుతానికి కచ్చితంగా నిర్ధారించలేమని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earth  Mars  European Space Agency  Mars Express orbiter  south pole  Red Planet  Radar  Water  Clay  NASA  

Other Articles