RPF constable saves woman passenger at secundrabad వృద్ద మహిళను రక్షించిన పోలీసుపై నెటిజనుల ప్రశంసలు

Rpf constable rescues old woman from falling under the moving train

moving train, rpf constable, woman fallen from train, woman crushed under train, rpf constable secunderabad, rpf woman constable saves child, constable saves woman, rpf constable saves woman, constable saves old woman falling under train, rpf constable saves life, Railway station, woman passenger, Secundrabad, running train, RPF constable, CCTV footage, Netizens, viral video

Quick response from a Railway Protection Force constable saved the life of an elderly woman at the Secunderabad Railway Station here on Friday. A video of the incident, which has since gone viral on social media, shows the elderly woman, identified later as Naseema Begum, running to board a train that had already started moving.

ITEMVIDEOS: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వృద్దమహిళను రక్షించిన పోలీసు..

Posted: 07/31/2021 02:47 PM IST
Rpf constable rescues old woman from falling under the moving train

ఒక్కో సారి క్షణకాలంలో జీవితం మొత్తం మన కళ్ల ముందు కనిపిస్తుంది. పెద్ద అపద నుంచి తప్పించుకో గలిగిన్నప్పుడు.. లేదా ప్రాణాపాయస్థితి నుంచి తృటిలో బయట పడినప్పుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ఓ వృద్ద మహిళకు కూడా అదే జరిగింది. కదులుతున్న రైలు వేగాన్ని అందుకుంటున్న సమయంలో దానిని ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వృద్ద మహిళ.. అనుకోకుండా అదుపుతప్పి ఫ్లాట్ ఫామ్ పై పడింది. ఆ దెబ్బతో అమె పైప్రాణాలు పైనే పోయాయి.

ఆమె రైలు ఎక్కడాన్ని గమనించి.. కిందపడిన అమెను క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగుపరుగున వెళ్లి అమెను రైలు కింద పడనీయకుండా చేశాడు రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్. మరో విధంగా చెప్పాలంటే అమె ప్రాణలతో సురక్షితంగా ఉందంటే.. కానిస్టేబుల్ కాపాడటం వల్లే. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి ఓ యువకుడు తన తల్లి నసీమా బేగంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. వారు ఎక్కాల్సిన రైలు వారు ఫ్లాట్ ఫామ్ వద్దకు చేరుకునే సరికి కదులుతుంది. దీంతో యువకుడు వేగంగా వెళ్లి ఎక్కేశాడు.

అతని వెంట అతని తల్లి అనుసరించి.. రైలు కదులుతున్న క్రమంలో అమె కూడా వేగంగా వెళ్లి ఎక్కాలనుకుంది. ప్రయత్నం చేసింది. కానీ అదుపుతప్పింది. ఫ్లాట్ ఫాంపై పడిన మ‌హిళా ప్ర‌యాణికురాలిని.. అక్క‌డే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ కానిస్టేబుల్ దినేష్ సింగ్ అప్ర‌మ‌త్త‌మై ఆ మ‌హిళ రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్యలోని ఇరుక్కుపోకుండా బయటకు లాగాడు. అయితే రైలు లోపల వున్న అమె కొడుకు అమె చేతిని పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తుండటంతో.. వదిలిపెట్టాలని సూచించాడు. దీంతో నసిమా బేగంను సురక్షితంగా పక్కకు లాగి అమె ప్రాణాల‌ను కాపాడాడు.

వృద్ద ప్ర‌యాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ దినేష్ సింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. రద్దీగా వుంటే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా సిబ్బందికి చెందిన బృందాలు ఎంత అప్రమత్తంగా వుంటాయో దినేశ్ సింగ్ నిరూపించాడు. కానిస్టేబుల్ దినేశ్ సింగ్ పై రైల్వే ఉన్న‌తాధికారులు, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో పాటు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడీయోను నెట్టింట్లో అప్ లోడ్ చేసిన పోలీసులు.. క్షణకాలం తొందరతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని కూడా సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles