Russian module fires on International Space Station ఇంటేర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు స్థానభ్రంశం.. ’నౌక’ అమరికలో ప్రమాదం

International space station knocked out of position as new russian science lab malfunctions

International Space Station, ISS altitude, NASA, Nauka module, russian module, space station, crime

The International Space Station has been knocked out of position after a Russian science lab malfunctioned. The newly arrived lab accidentally fired its thrusters, resulting in the ISS losing control of its orientation for 47 minutes, NASA said. Russian cosmonauts had been checking for leaks between the 22-tonne lab - named Nauka - and the service module, when automatic sensors on the ground detected the problem.

స్థానభ్రంశానికి గురైన అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. ’నౌక’ అమరికలో ప్రమాదం

Posted: 07/30/2021 11:56 AM IST
International space station knocked out of position as new russian science lab malfunctions

అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం స్థానభ్రంశానికి గురైంది. రష్యాకు చెందిన సైన్స్ ల్యాబ్ ను ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ తో అనుసంధానం చేసే అమరికలో వైఫల్యం కారణంగా భారీ కుదుపున‌కు గురైంది. దీంతో ఆ స్పేస్ స్టేష‌న్ 45 డిగ్రీల మేర మ‌రోవైపు క‌దిలింది. ర‌ష్యాకు చెందిన సైన్స్ ల్యాబ్ అనుసంధానం తరువాత ప్రమాదవశాత్తు ఆ ల్యాబ్ థ్రస్టర్లు ఫైర్ అయ్యాయి. దీంతో ఏకంగా 47 నిమిషాల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన ఓరియంటేషన్ పై నియంత్రణను కోల్పోయింది.

దీంతో 22 టన్నుల బరువు, 43 అడుగుల పోడవు వున్న ఈ సైన్స్ ల్యాబ్ కు నౌకాగా నామకరణం చేసిన రష్ట్యాకు చెందిన వ్యోమగాములు థ్రస్టర్ల మధ్య లీకులతో పాటు దాని మాడ్యూల్ లోని లీకులను కూడా పరిశీలిస్తున్నారు. మాడ్యూల్ ను డాకింగ్ చేసిన త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘటనతో కంట్రోల్ స్టేషన్లతోనూ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి రెండు పర్యాయాలు పలు నిమిషాల పాటు అనుసంధానానికి విఘాతం కలిగిందని కూడా నాసా వర్గాలు తెలిపాయి.

అయితే అంతరిక్ష శాస్త్ర‌వేత్త‌లు స్పేస్ స్టేష‌న్ ను మ‌ళ్లీ స‌రైన ఆల్టిట్యూడ్ లో పెట్టారు. ఈ ఘ‌ట‌న వ‌ల్ల ఆ అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమ‌గాముల‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. అటోమేటిక్ సెన్సార్ల సాయంతో మిష‌న్ కంట్రోల్ బృందాలు.. స్పేస్ స్టేష‌న్‌లో జ‌రిగిన లోపాల‌ను గుర్తించాయి. ఆ వెంటనే లోపాలను స‌రిదిద్దార‌ని, ప్రస్తుతం అన్ని సిస్ట‌మ్స్ సాధారణంగా ఆప‌రేట్ అవుతున్న‌ట్లు నాసా స్పేస్ ఏజెన్సీ స్ప‌ష్టం చేసింది. ఇక ప్రస్తుతం స్పెస్ స్టేషన్ కదలిక కూడా స్థిరంగా వుందని తెలిపింది.

ప్రమాదం జరిగిన సమయంలో సెకను అర డిగ్రీ మేర స్పేస్ స్టేషన్ తన అలైన్ మెంట్ నుంచి పక్కకు జరిగిందని, దీంతో అందులోని వ్యోమగాములకు కూడా పెద్దగా కదలిక గురించి తెలియలేదని నాసా స్పేస్ స్టేషన్ మేనేజర్ జోయెల్ మోన్టల్ బానో తెలిపారు. ప్ర‌స్తుతం స్పేస్ స్టేష‌న్‌లో అమెరికా, ర‌ష్యాకు చెందిన ఏడు మంది సిబ్బంది ఉన్నారు. మాడ్యూల్‌ను ఫిక్స్ చేసిన కొన్ని గంట‌ల త‌ర్వాత స్పేస్ స్టేష‌న్ అదుపు త‌ప్పిన‌ట్లు నాసా చెబుతోంది. ఆ స‌మ‌యంలో వ్యోమ‌గాముల‌తో క‌మ్యూనికేష‌న్ దెబ్బ‌తిన్న‌ట్లు నాసా పేర్కొన్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : International Space Station  ISS altitude  NASA  Nauka module  russian module  space station  crime  

Other Articles

Today on Telugu Wishesh