Eight Crore Rupees Supari For YS Viveka’s Murder! వైఎస్ వివేక హత్యకేసులో సీబిఐ చేతికి కీలక ఆధారం..

Ys vivekananda reddy murder case cbi s investigation at crucial stage

CBI, murder case, Vivekananda, Rangaiah, servent, 45 days investigation, 1600 persons interogation, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

According to a story by Andhrajyothy, CBI has collected key evidence in the YS Viveka murder case. The report claimes Rs 8 crore has been given as supari to eliminate the former minister. The CBI probe revealed that two prominent persons had given the supari.

వైఎస్ వివేక హత్యకేసులో కీలక ఆధారం.. 45 రోజు కొనసాగుతున్న దర్యాప్తు

Posted: 07/23/2021 06:14 PM IST
Ys vivekananda reddy murder case cbi s investigation at crucial stage

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. 45 రోజులుగా సీబీఐ విచారణను కోనసాగిస్తోంది. కాగా తాజాగా ఈ కేసులో సిబిఐ చేతికి కీలక అధారం లభించిందని సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు సన్నిహితులు, హత్యకేసులో అనుమానం ఉన్నవారిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్‌ మెన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు. సెక్షన్ 164 ప్రకారం జమ్మలమడుగు న్యాయస్థానంలో వీరిని విచారించినట్లు అధికారులు తెలిపారు.

కాగా, వాచ్ మెన్ రంగయ్య, డ్రైవర్ దస్తగిరి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రెండుగంటల పాటు వీరిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వివేకా హత్యకేసులో తొమ్మిది మందికి సంబంధం ఉన్నట్లు వాచ్ మెన్ రంగయ్య చెప్పినట్లు తెలుస్తుంది. ఈ తొమ్మిది మంది వివరాలను కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక రంగయ్య స్టేట్మెంట్ ప్రకారం వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా గత మూడు రోజులుగా రంగయ్యను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించారు.

తొమ్మిది మంది కలిసి ఈ హత్య చేసినట్లు రంగయ్య తెలిపారు. ఈ హత్య కేసు విషయంలో సీబీఐ గత 45 రోజులుగా ఏకంగా 1600 మందిని సీబిఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే గంగిరెడ్డి, గంగాధర్, జగదీశ్వర్ రెడ్డితోపాటు, మరికొందరిని విచారించారు సీబీఐ అధికారులు. తాజాగా వాచ్‌‌మెన్ రంగయ్యను విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles