India’s Actual COVID-19 Deaths Could Be in Millions దేశంలో కరోనా మృతుల సంఖ్య మిలియన్లలోనే: సర్వే

India has 414k covid 19 deaths to date the actual toll could be 10 times higher

covid-19, coronavirus, harsh vardhan, Arvind Subramanian, covid deaths in India, India Corona Deaths, Corona effected, Covid deaths, Covid actual deaths in India, National, Politics

New research suggests that the actual number of COVID-19 deaths in India could be as much as 10 times the official count. An independent, non-government report estimates the number of deaths at between 3 to 4.7 million, from January 2020 to June 2021.

దేశంలో కరోనా మృతులు: ప్రభుత్వ లెక్కల కన్నా పదిరెట్లు అధికం: సర్వే

Posted: 07/21/2021 11:24 AM IST
India has 414k covid 19 deaths to date the actual toll could be 10 times higher

కాలజ్ఞానంతో భవిష్యత్తును ముందుగానే చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగానే దేశంలో కొక్కరకో అను వ్యాధి సోకి కోటి మంది మరణిస్తారా.? అన్న అనుమానాలు ఇప్పడు నిజం అవుతున్నాయి, దేశంలో కరోనా మహమ్మారితో ఇప్పటికే ఏకంగా 47 లకల మంది మృత్యువాతపడ్డారని తాజాగా ఓ సర్వే తేల్చింది. దీంతో చాలా మంది అనుమానిస్తున్న‌దే నిజ‌మ‌ని తాజాగా ఈ స‌ర్వే తేల్చింది. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా కార‌ణంగా చ‌నిపోయింది 4.14 ల‌క్ష‌ల మంది అని ప్ర‌భుత్వ రికార్డులు చెబుతున్నా.. అందులో నిజం లేదని వాస్తవిక మరణాలు అంతుకుమించి జరిగాయని సర్వేలు తేలుస్తున్నాయి.

ప్రభుత్వం చూపిన కరోనా మరణాల లెక్కలు కన్నా ప‌ది రెట్లు ఎక్కువే ఉంటాయ‌ని ఈ స‌మ‌గ్ర స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అంతేకాదు దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత ఇంత‌టి పెను విషాదాన్ని ఇండియా గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌నీ ఈ స‌ర్వే తేల్చింది. ఈ స‌ర్వేను దేశ మాజీ ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు అర‌వింద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌తోపాటు సెంట‌ర్ ఫ‌ర్ గ్లోబ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన ఇద్ద‌రు రీసెర్చ‌ర్లు చేశారు. దీని ప్ర‌కారం దేశంలో 2020 జ‌న‌వ‌రి నుంచి 2021 జూన్ మ‌ధ్య క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వాళ్ల సంఖ్య 30 ల‌క్ష‌ల నుంచి 47 ల‌క్ష‌ల మ‌ధ్య ఉండొచ్చు.

అధికారిక లెక్క‌ల కంటే అస‌లు మ‌ర‌ణాల రేటు ఎంత ఎక్కువ‌గా ఉందో దీనిని బ‌ట్టి తెలుస్తోంద‌ని ఆ స‌ర్వే చెబుతోంది. పేషెంట్ల‌తో హాస్పిట‌ల్స్ కిక్కిరిసిపోవ‌డం లేదా స‌రైన స‌మ‌యానికి వైద్యం అంద‌క‌పోవ‌డం వ‌ల్ల చ‌నిపోయిన వారిని లెక్క‌లోకి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ భారీ తేడా వ‌చ్చి ఉండొచ్చ‌ని ఈ స‌ర్వే అంచ‌నా వేసింది. కొవిడ్ మ‌ర‌ణాలు ల‌క్ష‌ల్లో కాదు.. మిలియ‌న్ల‌లో ఉన్నాయి. దేశ విభ‌జ‌న త‌ర్వాత ఇదే అతిపెద్ద విషాదం అని ఆ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది. 1947లో దేశ విభ‌జ‌న సంద‌ర్భంగా హిందూ, ముస్లింల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ప‌ది ల‌క్ష‌ల మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు.

మూడు ప‌ద్ధ‌తుల్లో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌గ‌ట్టింది ఈ స‌ర్వే. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో జ‌న‌న‌మ‌ర‌ణాల‌ను న‌మోదు చేసే రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌స్థ నుంచి సేక‌రించిన డేటా, ఇండియాలో వైర‌స్ ఎంత ప్ర‌బ‌లంగా ఉందో చెప్పే ర‌క్త న‌మూనాల‌తోపాటు అంత‌ర్జాతీయంగా కొవిడ్ మ‌ర‌ణాల రేటు, ఏడాదికి మూడుసార్లు 9 ల‌క్ష‌ల మందిపై చేసే ఆర్థిక స‌ర్వే ఆధారంగా మ‌ర‌ణాలను లెక్క‌గ‌ట్టారు. అన్ని ర‌కాల మ‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని, దానిని గ‌తేడాది మ‌ర‌ణాల‌తో పోల్చి ఈ లెక్క తేల్చిన‌ట్లు రీసెర్చ‌ర్లు చెప్పారు. ఇత‌ర దేశాలు కూడా కొవిడ్ మ‌ర‌ణాల లెక్క త‌ప్పినా.. ఇండియాలో మాత్రం ఆ తేడా చాలా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh