pawan kalyan decides to fight on job calendar నిరుద్యోగుల పక్షాన జనసేనాని సమరశంఖం.. జాబ్ క్యాలెండర్ పై పోరాటం..

Janasena supports unemployed youth pawan kalyans to fight on job calendar

AP CM YS Jagan, YSRCP Election Promise, Unemployment youth, Pawan Kalyan, Vijayawada farmers, Mangalagiri farmers, Employment, Mega DSC, Teachers Recruitment, Government jobs, janasena, job calendar, AP Govt jobs, Andhra Pradesh, Politics

Janasena comes in support of Andhra Pradesh Unemployed Youth, who are fighting against AP Government Job Calender. Pawan Kalyan assures the youth that his party would fight against AP Govt Job calender.

నిరుద్యోగుల పక్షాన జనసేనాని సమరశంఖం.. జాబ్ క్యాలెండర్ పై పోరాటం..

Posted: 07/17/2021 04:05 PM IST
Janasena supports unemployed youth pawan kalyans to fight on job calendar

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ వైపు తన చిత్రాల షూటింగ్ తో బిజీగా వుంటూనే.. ఇటు రాజకీయాలకు కూడా తన సమాయాన్ని కేటాయిస్తూ బిజీగా వున్నారు. ఇటీవల మంగళగిరిలో పర్యటనించిన పవన్ కల్యాణ్.. అమరావతి ప్రాంత రైతులను కలిసిన విషయం తెలిసిందే, ఇక ఆ వెంటనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతతోనూ సమావేశం అయ్యారు. ఈ క్రమంలో రైతుల సమస్యలతో పాటు నిరుద్యోగ యువత సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల కోసం కేంద్రంలోని పెద్దలను కలసి అమరావతిని రాజధానిగా కోనసాగించాలని కోరిన విషయం తెలిసిందే.

తాజాగా నిరుద్యోగ యువత కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్దం కావాలని యోచనలో వున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని పవన్‌ చెప్పారు. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని పవన్ చెప్పారు. ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్‌ అన్నారు.

ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత 10వేల ఉద్యోగాలు ప్రకటించడం యువతను వంచించడం కాకమరేటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని నిరుద్యోగ యువత ఎంతో ఆవేదన చెందుతొందని అన్నారు. గ్రూప్‌-1, 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమేనని అర్థమవుతుందన్నారు. కొద్ది నెలల కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్‌-1, 2ల్లో సుమారు 1000 ఖాళీలను గుర్తించారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో 36 మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.

ఉద్యోగాలకు సుమారు 20 లక్షల మంది వరకూ పోటీ పడతారని, పోటీ పరీక్ష ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ విధంగా నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకొంటుందని పవన్‌ వాపోయారు. టీచర్ పోస్టులు వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయని, సీఎం చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయిందని నిలదీశారు. పోలీసు శాఖలో 7 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదని పవన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభించని పరిస్థితి నెలకొందని పవన్ వాపోయారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణ కూడా సాగటం లేదని పవన్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM YS Jagan  Pawan Kalyan  Employment  Government jobs  janasena  job calendar  Andhra Pradesh  Politics  

Other Articles