SCR restoring express and passenger trains from 19th July పట్టాలపైకి ప్యాసింజర్ రైళ్లు.. స్టేషన్లలోనే టికెట్లు

South central railway restoring all express and passenger trains from 19th july

Covid protocol, express trains, passenger trains, regular trains, passenger trains, new trains in scr routes, train tickets at railway stations, South Central Railway, Special Trains, Train Tickets, Indian Railway, Railway tickets

Good news for train commuters in South Central Railway Zone. The authorities of the South Central Railway (SCR) zone announced that they are restoring all 66 passenger trains from 19th July. Apart 16 express trains are also restored in the routes of SCR with new train numbers.

సోమవారం నుంచి పట్టాలపైకి ప్యాసింజర్ రైళ్లు.. స్టేషన్లలోనే టికెట్లు

Posted: 07/17/2021 03:07 PM IST
South central railway restoring all express and passenger trains from 19th july

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రైలు ఏ సమయానికి వస్తుందో.. టికెట్లు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి సామాన్య ప్రయాణికులు జారుకున్నారు. ఏ రైలును ఎప్పుడు ప్రవేశ పెడుతున్నారో.. ఎప్పుడు రద్దు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొనింది. ఇక అంతర్జాలమే తెలియని వాళ్లు రైలు ప్రయాణాలకు కూడా దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కనున్నాయని ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ కాగా 66 ప్యాసింజర్‌ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. అంతేకాదు.. ప్యాసింజర్‌ రైలులో ప్రయాణం కోసం ఇక నుంచి స్టేషన్లోనే టికెట్లు ఇవ్వనున్నారు రైల్వే అధికారులు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాయచూరు వరకు రైళ్లు నడపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణికులందరూ కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొంది. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ కఠినంగా అమలు చేయనున్నారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles