Railway monthly passes to be issued soon త్వరలో రైల్వే నెలవారీ పాసుల పునరుద్దరణ.?

Railway monthly passes for regular passenger to be issued soon

Daily passengers, Railway Good news, regular passengers, monthly passess, Railway Department, student passengers, employee passengers, regular train travellers, small businessman, Railway Ministry

Due to covid-19 pandemic Indian Railways had stoped the issuance of montlhy passes to students, employees, and regular passengers last year. Now the railway ministry is trying to resume the same services soon.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త: త్వరలో నెలవారీ పాసుల పునరుద్దరణ

Posted: 07/12/2021 06:46 PM IST
Railway monthly passes for regular passenger to be issued soon

ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వశాఖ త్వరలోనే  శుభవార్తను అందించనుంది. అయితే ఇది కేవలం రెగ్యూలర్ రైలు ప్రయాణికులకు మాత్రమే. ఔనండీ కరోనా మహమ్మారికి ముందుకు సుదూర ప్రాంతాలకు విద్య, ఉద్యోగం, వ్యవహారాలు, వ్యాపారాల నిమిత్తమై ప్రతి రోజు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే పాస్ తీసుకునేవారు. ప్రతీ నెల వీటిని రినీవాల్ కూడా చేయించుకునేవారు. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు రైళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో.. దాంతోనే ఈ నెలవారీ పాసులు కూడా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో అన్ని వ్యవహారాలు యధావిధిగా నడుస్తున్నాయి.

ఈ క్రమంలో రైల్వే కూడా త్వరలో నెలవారీ పాసులు జారీ చేయనుంది రైల్వే వర్గాల సమాచారం. రైల్వే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నెలవారీ పాసులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. నెలవారి పాసులు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికప్పుడు టిక్కెట్ తీసుకునే రైలులో ప్రయాణించే అవకాశం లేకపోవడం.. ముందస్తు రిజర్వేషన్ తో మాత్రమే ప్రయాణించే వెసలుబాటు వుండటంతో రెగ్యూలర్ గా రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవల భోపాల్ రైల్వే డివిజన్ నెలవారీ పాస్ లను తిరిగి పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదన పంపింది. అయితే దీనిపై కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులందరికి వర్తించేలా ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. నెలవారీ పాస్ ల జారీ ద్వారా రైల్వేకు నికర అదాయం లభిస్తుంది. గత ఏడాదిగా సీజనల్ పాస్ ల జారీ నిలిచిపోవటంతో వచ్చే ఆదాయానికి గండిపడింది. త్వరలో తీసుకోబోయే రైల్వే శాఖ నిర్ణయం కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles