Don't summon officials unnecessarily, says SC జడ్జీలు.. మీరు రాజులు కాదంటూ.. ‘సుప్రీం’ పలు సూచనలు

Don t summon officials unnecessarily says supreme court

supreme court, Justice S.K. Kaul, Justice Hemant Gupta, Lower court judges, cross the line, separation of powers, judiciary, executive, call, summon, officers, allahabad high court, unnecessarily

The Supreme Court said that judges should not behave like “emperors” and summon government officials “at the drop of a hat”. Top Court said there would be a “reaction” if judges cross the line of separation of powers between the judiciary and the executive to call officers to court “unnecessarily”.

జడ్జీలు.. మీరు రాజులు కాదంటూ.. పలు సూచనలు చేసిన సుప్రీంకోర్టు

Posted: 07/10/2021 06:31 PM IST
Don t summon officials unnecessarily says supreme court

న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రభుత్వాధికారులను కోర్టులకు పిలవటం పట్ల అభ్యంతరం వ్యక్తంచేసింది దేశ అత్యున్నత ధర్మాసనం. న్యాయమూర్తులు చక్రవర్తుల్లా ప్రవర్తించవద్దని చీటికీ మాటికి అధికారులను కోర్టులకు పిలవద్దని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. న్యాయమూర్తులు ‘చక్రవర్తుల్లా’ ప్రవర్తించవద్దని ప్రభుత్వాధికారులను చీటికీ మాటికి కోర్టులకు పిలిచి వారి సమయాలను వృధా చేయవద్దని..కొన్ని కేసుల్లో జడ్జీలు చీటికిమాటికి ప్రభుత్వాధికారులను కోర్టుకు పిలవడం సరికాదని పేర్కొంది.

ఇటువంటి పద్ధతిలకు స్వస్తి చెప్పాలని సూచించింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలుస్తూ న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అధికారాల మధ్య విభజన రేఖను దాటితే ‘ప్రతిచర్య’ తప్పదని ఎస్‌కే కౌల్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. అధికారులను అప్పటికప్పుడు రమ్మనడం వల్ల ముఖ్యమైన పనులు..ఇతర కార్యక్రమాలను విడిచిపెట్టాల్సి రావాల్సి వస్తుందని జస్టిస్ గుప్తా పేర్కొన్నారు. ఇటువంటి ఆదేశాలు కోర్టు ఇస్తే అధికారులు కొన్నిసార్లు సుదూర ప్రయాణం చేయాల్సి రావొచ్చని..కాబట్టి ఎంతో అవసరం అయితే తప్ప చిన్న చిన్న విషయాలకు కూడా అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవకూడదని గుప్తా అన్నారు.

అధికారులను తరచూ కోర్టుకు పిలవడం సరైందికాదన్నారు. ఇటువంటి విషయాలను బలమైన పదాలతో ఖండించాల్సిన విషయమని అన్నారు. న్యాయమూర్తులు తమ పరిధిలో అణకువతో, నిగర్వంగా వ్యవహరించాలి తప్ప చక్రవర్తుల్లా ప్రవర్తించకూడదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవడం వల్ల న్యాయస్థానం గౌరవం పెరగదని..విధుల్లో చేరని ఉత్తరాఖండ్ అధికారులకు సగం జీతం చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనుచితంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles