COVID-19 Delta variant spreading rapidly: WHO chief scientist కరోనా డెల్టా ప్లస్ అత్యంత తీవ్రమైనది: సౌమ్యా స్వామినాథన్

Covid 19 delta variant spreading rapidly who s chief scientist dr soumya swaminathan

Soumya Swaminathan,coronavirus cases,Covid-19,WHO,World health organisation,Covid-19 cases globally,Covid-19 vaccine,WHO chief scientist,Dr Soumya Swaminathan, covid-19, Coronavirus, Reinfection, rare, covid re-infections, immunity lasting in those who contracted Covid-19, pune study, DY Patil Medical College, epidemiologists, community medicine experts, SARS-CoV-2 antibodies, PLOS Medicine

With the spread of the Delta variant of Covid-19, the number of infections has been rising across most regions of the world, chief scientist of the World Health Organisation (WHO) Soumya Swaminathan said. She also called it clear evidence that the pandemic is not on the wane yet

కరోనా డెల్టా ప్లస్ అత్యంత తీవ్రమైనది: డబ్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త

Posted: 07/10/2021 03:47 PM IST
Covid 19 delta variant spreading rapidly who s chief scientist dr soumya swaminathan

కరోనా మహమ్మారి ముప్పు పోయిందన్న యోచనలో యావత్ ప్రపంచం వుందని అయితే అది ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, దక్షిణాఫ్రికా, భారత్ సహా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు తెరపైకి వస్తున్నాయని, అయితే ఇది అత్యంత తీవ్రమైన వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ సూచించారు. నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంలోనూ.. తీవ్రతలోనూ అత్యంత ప్రమాదకారి అని అమె తెలిపారు. కరోనా మహమ్మారి సోకిన వ్యక్తి నుంచి ముగ్గురి మాత్రమే పరిమితం అయిన తొలిదశ, రెండవ దశ వేరియంట్లుకు భిన్నంగా డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి సగటున 8 మందికి ఈ వైరస్ వ్యాపిస్తోందని అమె తెలిపారు. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల కేసులు నమోదు కాగా, 9,300 మంది మరణించారని ఆమె చెప్పారు. కరోనా ఇంకా నెమ్మదించలేదనడానికి ఇదే సంకేతమన్నారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘డెల్టా కరోనా’ చాలా ప్రమాదకారి అని, దాంతోనే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. మామూలు కరోనా సోకిన వ్యక్తి నుంచి మహా అయితే ముగ్గురికి వైరస్ అంటుతుందని, కానీ, డెల్టా సోకిన వ్యక్తి నుంచి 8 మందికి వ్యాపిస్తోందని ఆమె హెచ్చరించారు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఇటు ప్రజలూ కొంచెం సేద తీరేందుకు టూర్లకు వెళ్తున్నారని, కనీసం కరోనా నిబంధనలను పట్టించుకోవడం లేదని అన్నారు. గుమికూడుతూ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు కేసులు పెరగడానికి ఇదీ ఒక కారణమేనన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles