EPFO: Get Rs 1 lakh in just an hour during emergency అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుంచి రూ. లక్ష తీసుకోవచ్చు

Epf alert now get rs 1 lakh within a hour for covid other illness

epf withdrawal, epf india, epf interest rate, epf balance, epf balance check, epf covid withdrawal, epf covid withdrawal rules, epf covid insurance, epf covid relief, EPF, PF, One Lakh, Rs 1 Lakh, one hour, health emetgency, medical emergency, employees, Provident fund, Advacne, union Government

The government has come up with a new service, that will help you if there is a sudden need for money in the event of the coronavirus pandemic or any kind of medical emergency. The members of the Employees' Provident Fund (EPF) can now withdraw an advance of Rs 1 lakh from their PF balance immediately in case of any sudden medical emergency.

అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నుంచి రూ. లక్ష తీసుకోవచ్చు

Posted: 07/08/2021 06:13 PM IST
Epf alert now get rs 1 lakh within a hour for covid other illness

ఉధ్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా చికిత్స లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్స్ (అత్యవసర వైద్య అవసరాలు) పరిస్థితుల్లో పీఎఫ్ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ (పీఎఫ్) అకౌంట్ నుంచి లక్ష రూపాయలు అడ్వాన్స్ గా పొందవచ్చునని తీసుకోవచ్చని ఈపీఎఫ్ తెలిపింది. అంతేకాదు ఈ సదుపాయాన్ని పొందేందుకు ఎలాంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం కూడా లేదంది.

కరోనా సహా ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లయితే.. లక్ష రూపాయల వరకు మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఈపీఎఫ్ సభ్యుడు ఎలాంటి బిల్లు లేదా అంచనా వ్యయ వివరాలు చూపాల్సిన అవసరం లేదు. అంతేకాదు దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ చేస్తామంది. ఇంతకుముందు, ఈపీఎఫ్ఓ మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం పీఎఫ్ ఖాతాను నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు అనుమతించింది. అయితే అది వ్యయ అంచనాల ఆధారంగా లేదా మెడికల్ బిల్స్ రీయింబర్స్‌మెంట్ తర్వాత మాత్రమే లభించేది. ఇప్పుడు మరింత వెసులుబాలు కల్పించింది.

మెడికల్ అడ్వాన్స్‌ తీసుకునేందుకు మార్గదర్శకాలు…

* రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సిజిహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి.
* ఎమర్జెన్సీలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినా.. అప్పుడు ఈఫీఎఫ్ అధికారి పరిశీలిన నివేదిక అందించాలి.
* ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా రోగి, అతన్ని చేర్పించిన ఆసుపత్రి వివరాలను తెలియజేస్తూ ఓ అప్లికేషన్‌ను సమర్పించాలి.
* ధరఖాస్తులో అంచనా వ్యయం లేదని పేర్కొనాలి. దాంతో మెడికల్ అడ్వాన్స్ మంజూరు అవుతుంది.
* మెడికల్ అడ్వాన్స్ కు దరఖాస్తు చేసుకున్న గంటలోపే ఆ డబ్బు ఖాతాదారుడి అకౌంట్ లోకి బదిలీ అవుతుంది.
* ఈ మెడికల్ ఎమర్జెన్సీ అడ్వాన్స్ లో మొత్తం ఫండ్ లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles