Tourists violate covid norms at Mussoorie's Kempty Falls కరోనాను మర్చి జలకాటలలో వందలాది మంది పర్యాటకులు..

Viral video hundreds of maskless tourists throng kempty falls in mussoorie

Mussoorie, kempty falls crowd video, tourist flout covid protocol Mussoorie video. Mussoorie kempty falls tourist crowd video, viral, viral videos, trending, trending videos, youtube, covid, covid norms, kempty falls, Mussoorie

Tourists flocked to Uttarakhand's top holiday destinations Mussoorie and Nainital after Covid-19 restrictions were eased in a situation that was rather similar to Himachal Pradesh. Hotels were full and there were long queues of vehicles on the streets as people escaped to the hills in order to beat the heat in the plains.

ITEMVIDEOS: వైరల్ వీడియో: కరోనాను మర్చి జలకాటలలో పర్యాటకులు..

Posted: 07/08/2021 07:06 PM IST
Viral video hundreds of maskless tourists throng kempty falls in mussoorie

సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం ఎంత తీవ్రంగా ఉందో కళ్లారా చూశాం. దేశంలోని ప్రతీ వీధిలో, ప్రతీ గ్రామంలోని ప్రజలను తన బారిన పడేసుకుని అందులో కొందర్ని బలి తీసుకుని అల్లకల్లోలం చేసింది. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదిలారు. తమ వాళ్లను కాపాడుకునేందుకు ఆక్సిజన్ కోసం లైన్ లో నిలబడి తెచ్చుకున్నా ఫలితం దక్కని దాఖలాలున్నాయి. దేశ, విదేశాలు అనేకం భారతీయుల పరిస్థితి చూసి స్పందించి రెమిడిసెవీర్ మందుతో పాటు అక్సిజన్ కాన్సెంట్రేటర్లను విరాళంగా అందించి ఔదార్యాన్ని చాటుకున్నాయి.

ఇక రెండో దశ పూర్తిగా తగ్గిపోకముందే మరో దశగా కరోనా మహమ్మారి విజృంభనుందన్ని.. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు పుట్టుకోచ్చి ప్రజలపై మరోమారు పడనున్నాయని నిపుణుల అంచనాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్త చర్యల మధ్య తమ దినచర్యను పూర్తి చేసుకోవాల్సిన ప్రజలు.. అన్నించినీ మర్చి కేవలం ఆనందోత్సవాల కోసం జలకాలటల కోసం రావడం చిత్రంగా వుంది. మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, కరోనా నియమాలను అనుసరించడం వంటి వాటిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎక్కడపడితే అక్కడ గుంపులు కట్టేస్తున్నారు. ఎంజాయ్ మెంట్ లో మురిసిపోతూ కరోనాను మరచిపోతున్నారు. ఇదిగో వీళ్ల తంతు అలాగే ఉంది మరి.

ఉత్తరాఖండ్ లో కరోనా ఆంక్షలను సడలించిన తర్వాత జనం రోడ్లెక్కేశారు. ముస్సోరి, నైనిటాల్ వంటి ప్రాంతాలకు గుంపులు కట్టేస్తున్నారు. హోటళ్లు ఫుల్లయ్యాయి. అక్కడికి వచ్చిపోయే వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే వందలాది మంది ముస్సోరిలోని కెంప్టీ జలపాతం వద్ద సందడి చేస్తూ కనిపించారు. కానీ, ఒక్కరైనా అక్కడ కరోనా నిబంధనలను పాటించలేదు. మాస్కుల్లేవు, దూరం లేదు.. అంతా ఎంజాయ్ మెంట్ మూడ్ లోనే ఉండిపోయారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కెంప్టీలో ఎంప్టీ బ్రెయిన్స్ (బుర్రలేనోళ్లు)’ అని కామెంట్ చేస్తున్నారు. ‘ఇది చాలా పవర్ ఫుల్ మూవ్: జలకలాడండి.. చావండి’ అంటూ మరో యూజర్ సెటైర్ వేశారు. అందరికీ కలిపి ఒక్కటే మెదడున్నట్టుందంటూ ఇంకో వ్యక్తి మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral  viral videos  trending  trending videos  youtube  covid  covid norms  kempty falls  Mussoorie  

Other Articles