పాము ఎదురుపడగానే చెమటలు పట్టి వణికిపోవడం మన వంతు అవుతుంది. కానీ దాని భయం కూడా దానికి ఉంటుంది. తనకు ప్రాణాపాయ పరిస్థితిఏర్పడుతుందన్న భయంతోనే అది తన వద్దనున్న కోరలనే ఆయుధంతో ఎదుటి ప్రాణిని బలి తీసుకుంటుంది. అంతేకాని కాటు వేయడం దాని స్వభావం కాదు.. భయం. పామును చూసిన మనుషులు ఎవరైనా. నోటమాట రాక నిశ్చేష్టులైపోతారు అది కూడా భయమే. ఇక పామును ముట్టుకోవాలంటే పైప్రాణాలు పైనే పోతాయి. ఎవరో కొందరు ధైర్యవంతులు మాత్రం సర్పాలతో ఆడుతూ ఔరా అనిపిస్తారు.
పాములకు తమ వద్ద ఉంటే భయం లేదన్న భరోసా కల్పిస్తే అవి ఏమీ అనవని తెలిసిన ఓ పెద్దాయన.. పాముకు పాలు పోసి పెంచుకుంటున్న సామెతను నిజం చేస్తున్నాడు. ఎక్కడి నుంచో తన ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకున్నాడు. దానిని తన మెడకు చుట్టుకుని తాను పరమశివుడి భక్తుడనని, అందుకనే పాము తనను ఏమీ చేయడం లేదని అంటున్నాడు. అంతటితో ఆగకుండా పామును తన మెడలో వేసుకునే.. సైకిలెక్కి ఊరంతా చుట్టివచ్చాడు. పలువురిని పలకరిస్తూ.. కొందరికి నమస్కారాలు చెబుతూ.. రివ్వున సైకిల్ పై వెళ్లసాగాడు.
ఈ పెద్దాయనను చూసేందుకు కొందరు ఆసక్తి చూపారు. మరికోందరు తమ వాహనాలు తీసుకుని ఆయనకు ముందుగా కదులుతూ.. తమ సెల్ ఫోన్ తో ఆ వీడియోను తమ ఫోన్లలో బంధించారు. ఈ సన్నివేశాలు చూపరులందరూ సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టారు. కర్ణాటకలో బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. ఓ వృద్ధుని ఇంట్లోకి పాము (జెర్రిపోతు) చొరబడగా ఏమాత్రం చలించకుండా పామును పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. సైకిల్ మీద గ్రామంలో సంచరించాడు. కొందరు అతన్ని ఆపి ఆసక్తిగా చూశారు. తరువాత పామును దూరంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more