Govt vaccination sites will soon offer Sputnik V for free: తర్వలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పుత్నిక్-వీ టీకాలు.!

Sputnik v soon to be available at government inoculation centres for free

Corona Vaccine, Covid Vaccine, Dr. Reddys Laboratories, Morepen, Sputnik V, Sputnik vaccine, Covid-19, Coronavirus, Russia, DGCI, Clinical Trails, DGCI Experts panel, Free, Covaxin, Covishield, Sputnik -V, Moderna

Amid the massive demand and need of the COVID-19 vaccine in the country, the Russian-made Sputnik V vaccine will soon be made available for free at government-run vaccination centres across India, Dr NK Arora, Chairman, Centre's COVID-19 working group, said.

తర్వలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పుత్నిక్-వీ టీకాలు.!

Posted: 07/06/2021 02:59 PM IST
Sputnik v soon to be available at government inoculation centres for free

దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా  ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ ఒకటి.  ఈ టీకా ఒక్కో డోసు ధర  రూ.1,145గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.  త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ కూడా  ఉచితంగా లభించ నుంది.  ఒకపక్క థర్డ్‌ వేవ్‌.. మరోపక్క డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భయాలు వెంటాడుతున్న తరుణంలో దేశ ప్రజలకు మరో వ్యాక్సిన్‌ ఉచితంగా అందుబాటులోకి రానుండటం శుభపరిణామం.
 
టైమ్స్ ఆఫ్ ఇండియా సమాచారం  ప్రకారం స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ కూడా త్వరలో ప్రభుత్వ కేంద్రాలలో  ఉచితంగా లభించనుంది ప్రస్తుతం, దేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభిస్తోంది. ఇపుడిక ఈ జాబితాలో రష్యా వ్యాక్సిన్‌ కూడా చేరనుండటం విశేషం. దేశంలో అత్యవసర వినియోగానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ప్రభుత్వ  కేంద్రాల్లోనూ ఉచితంగా  లభించే అవకాశం ఉందని కోవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ ప్రెసెడింట్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు.

తమ వ్యాక్సిన్‌ను సైతం ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నామని, అయితే టీకా సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. దీంతో దేశంలోవ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ సరఫరాలో కీలకంగా ఉన్న కోవీషీల్డ్‌, కోవాక్సిన్‌తోపాటు, స్పుత్నిక్‌-వీ, మోడర్నా, జైడస్‌ క్యాడిలాతో, రోజువారీ టీకాల పంపిణీ 8 నుంచి 10 మిలియన్లకు పెంచవచ్చన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి, 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్టు  అరోరా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dr. Reddys Laboratories  Sputnik V  Sputnik Vaccine  Morepen  Russia  Clinical Trails  DGCI  Experts panel  

Other Articles