Bihar nurse gives ’empty shot’ to man, video goes viral వ్యక్తికి ఖాళీ సిరంజితో వాక్సీన్.. నర్సు నిర్వాకం

Bihar nurse vaccinates man with empty syringe faces action after video goes viral

bihar, bihar empty vaccine shot, bihar empty syringe vaccine, bihar nurse empty syringe video, viral videos, covid vaccine bihar, Chanda Kumari, District Immunization Officer, Empty Syringe, Vaccine Drive, Bihar, National, Crime

In another incident of negligence, a nurse in Bihar allegedly injected an empty jab to a man at a vaccine centre in Saran. The video of the incident has now gone viral on social media. In the video, the nurse was seen injecting an empty syringe to the man in an overcrowded vaccination centre in Bihar’s Chapra district.

ముచ్చట్లు పెట్టి.. వ్యక్తికి ఖాళీ సిరంజితో వాక్సీన్.. నర్సు నిర్వాకం

Posted: 06/25/2021 09:37 PM IST
Bihar nurse vaccinates man with empty syringe faces action after video goes viral

బిహార్‌లొని కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ఒక నర్సు ఖాళీ సిరంజితోనే వ్యక్తికి వ్యాక్సిన్‌ వేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటపడడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో సీరియస్‌ అయిన వైద్యాధికారి సదరు నర్సును విధుల నుంచి తొలగించినట్లు మీడియాకు తెలిపారు. వివరాలు.. చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రంలో ఇది చోటుచేసుకుంది.

వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వచ్చిన వ్యక్తి కుర్చీలో కూర్చోగానే నర్సు ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న కొత్త సిరంజిని బయటికి తీసింది. అయితే దానిలో ఎలాంటి వ్యాక్సిన్‌ను నింపకుండానే ఇంజక్షన్‌ చేసేసింది. ఆమె వ్యాక్సిన్‌ వేస్తున్న ప్రక్రియను ఆ వ్యక్తి స్నేహితుడు తన ఫోన్‌ కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత వీడియోను పరిశీలించగా ఆమె ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్‌ వేసినట్లు తేలింది. దీంతో షాకయిన సదరు వ్యక్తి నర్సు నిర్వాకంపై అక్కడే ఉన్న సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. సూపరిండెంట్‌ విషయాన్ని వైద్యాధికారికి తెలపడంతో నర్సును విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.

కాగా వ్యక్తి స్నేహితుడు మాట్లాడుతూ..''నిజానికి టీకా తీసుకుంటే ఫ్రెండ్ రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌న్న ఉద్దేశంతో వీడియా తీశాను. కానీ ఆ వీడియోను మ‌ళ్లీ చూసిన‌ప్పుడు త‌న‌కు డౌట్ వ‌చ్చింద‌ని, ప్లాస్టిక్ క‌వ‌ర్ నుంచి నేరుగా ఆ న‌ర్సు సిరంజీ తీసి త‌న ఫ్రెండ్‌కు ఇచ్చిన‌ట్లు కనిపించింది.'' అని చెప్పుకొచ్చాడు. అయితే ఖాళీ టీకా తీసుకుకోవ‌డం వ‌ల్ల త‌న‌కు త‌ల నొప్పు వ‌చ్చిన‌ట్లు వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తి చెప్పడం కొసమెరుపు. ఆ తర్వాత అతను మరోసారి వ్యాక్సిన్‌ వేసుకోకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు.

 
 
 
View this post on Instagram

A post shared by The Logical Indian (@thelogicalindian)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chanda Kumari  District Immunization Officer  Empty Syringe  Vaccine Drive  Bihar  National  Crime  

Other Articles