Bank guard shoots Man for not wearing a mask మాస్క్ వేసుకోలేదని బ్యాంక్ కస్టమర్ పై కాల్పులు..

Bank guard shoots customer allegedly for not wearing a mask

bank of baroda, bareilly bank of baroda, guard shoots man bareilly bank, Security Guard, Shoots, Railway Employee, Mask, Rajesh Kumar, Keshav Prasad Mishra, bank of baroda junction road branch, bareilly Police, Uttar Pradesh, Bareilly news today, Crime

In a shocking incident, a security guard deployed at a bank in Bareilly opened fire at a customer who had come without wearing a mask. The security guard deployed at the Bank of Baroda's Junction Road branch shot the customer, identified as Rajesh Kumar, a railway employee, in the leg.

ITEMVIDEOS: మాస్క్ వేసుకోలేదని బ్యాంక్ కస్టమర్ పై కాల్పులు.. గార్డు అరెస్టు

Posted: 06/26/2021 11:11 AM IST
Bank guard shoots customer allegedly for not wearing a mask

మాస్కు ధరించకుండా బయటకు వెళ్తే పోలీసులు వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఇక జరిమానాలతో కూడా సరిపెట్టుకోని కొందరు యువకులపై పోలీసులు అప్పడప్పుడు తమ లాఠీలతో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే పదే పదే అదే తప్పును పునారావృతం చేస్తున్నవారిపై మాత్రం లాఠీలను జుళిపిస్తున్నారు. ఇది కూడా కామన్. కానీ ఎప్పుడూ ఎవరినీ కనీసం అరెస్టు చేయలేదు. అలాంటిది ఓ కస్టమర్ మాస్క్ పెట్టుకోకుండా తమ బ్యాంకులోకి ప్రవేశించిన కారణంగా అక్కడి విధులు నిర్వహిస్తున్న బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఏకంగా కాల్పులు జరపడం కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్ లోని బరేలిలోగల బ్యాంకు అప్ బరోడా శాఖలో జరిగిందీ ఈ ఘటన. అనూహ్యాంగా జరిగిన ఈ ఘటన నేపథ్యంలో స్థానికులతో పాటు బ్యాంకులోని సిబ్బంది, కస్టమర్లు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రస్తుతం బాధితుడు బరేలి జిల్లా అసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. కాగా కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజేశ్ అనే ఖాతాదారుడు భార్య ప్రియాంకతో కలిసి స్థానిక జంక్షన్ రోడ్డులో ఉన్న బరోడా బ్యాంకుకు వెళ్లాడు. అతడు ముఖానికి మాస్క్ ధరించకపోవడంతో సెక్యూరిటీగార్డు కేశవ్ అడ్డుకుని మాస్కు ధరించాలని సూచించాడు.

దీంతో మాస్కు ధరించి లోపలికి వెళ్తుండగా మరోమారు అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు ఇది భోజన సమయమని, లోపలికి అనుమతి లేదని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సెక్యూరిటీగార్డు రాజేశ్‌పై తుపాకితో కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న భర్త వద్ద భార్య ప్రియాంక రోదిస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డు కూడా వీడియోలో కనిపించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles