చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సమయంలో అకస్మాత్తుగా లేచిన అగ్నికీలలకు సుమారు 18 మంది మృతి చిన్నారులు సజీవ దహనమయ్యారు. కాగా.. మరో 16 మంది చిన్నారులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ప్రమాదఘటన సెంట్రల్ చైనాలోని మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. చైనా మీడియా ప్రకారం హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్ కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారని, 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదం సంభివించిన సమయంలో ఈ పాఠశాలలో మొత్తంగా 34 మంది విద్యార్థులు వున్నారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషమంగా వున్న నలుగురు విద్యార్థులను బ్రతికించడానికి తాము చేయగలిగిందంతా చేస్తున్నామని అక్కడి వైద్యులు తెలిపారు. హెన్నాన్ ప్రావిన్స్ ప్రభుత్వ అదేశాల మేరకు ఈ పాఠశాల మేనేజరును అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అగ్నిప్రమాదఘటనకు గల కారణాలు తెలియరాలేదని, అయితే దర్యాప్తు జరుగుతుందని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మార్షల్ అర్ట్స్ కు జన్మస్థానంగా భావించే ఈ హెన్నాన్ ప్రావిన్స్ లో మరీముఖ్యంగా కుంగ్ ఫు అధ్యయనాలను విద్యార్థులకు బోదిస్తుంటారు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హెన్నాన్ రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్త్రత్త చర్యలు తీసుకోవాలని చైనా ప్రావిన్షియల్ పార్టీ అధినేత సూచించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రంతికి గురిచేసిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more