Mizoram Minister offers cash for parent with most children అధిక సంతానం కలిగిన తల్లిదండ్రులకు కానుక: మిజోరం మంత్రి

Cash reward of rs 1 lakh for parents with most children mizoram minister

family with most children, mizoram birth rate, least populous state, mizoram family with maximum children, reward for big family, Robert Romawia Royte, Aizawl FC, two-child policy, Ziona Chana, Robert Romawia Royte,Mizoram minister calls for more babies,opulation control policies,anti-population control remarks,Mizo population,Fathers Day,prize money for more children,Young Mizo Association,YMA,Mizo tribal population,Mizo National Front,Aizawl East-II constituency,North East Consultancy Services

At a time when Assam and a few other states in the country have come up with a two-child policy to control population, a Mizoram minister has announced cash reward of Rs 1 lakh to any family with the highest number of children under his constituency.

అధిక సంతానం కలిగిన కుటుంబానికి కానుక ప్రకటించిన అమాత్యుడు

Posted: 06/22/2021 12:14 PM IST
Cash reward of rs 1 lakh for parents with most children mizoram minister

భారతదేశం చైనాను కూడా అధిగమించి దూసేకెళ్లేలా దేశజనాభా తయారవుతుందన్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మిజోరం రాష్ట్ర మంత్రి మాత్రం ఆసక్తికర ప్రకటన చేశారు. జనాభా నియంత్రణకు బదులుగా అధిక జనాభాను ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అధిక సంతానం కలిగిన తల్లిదండ్రులకు బహుమానం కూడా ఇస్తానని ప్రకటన చేయడం గమనార్హం. ఔనా, నిజమేనా అంటారా.. ఇది ముమ్మాటికీ నిజం. అయితే అందుకు ఓ కారణం కూడా వుందని పేర్కోంటున్నారు ఈ అమాత్యులు.

అయితే ఈ బహుమతి అందరికీ అనుకునేరు. మిజోరం వాసులకు కూడా కాదు. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అంటున్నారు. తన అసెంబ్లీస్థానం పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. అయితే అందుకు కారణాన్ని కూడా చెప్పారాయన. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్‌ రొమావియా వెల్లడించారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ తరహా ప్రకటన చేసిన ఆయన తన నియోజకవర్గం ఐజ్వాల్‌ తూర్పు-2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లీ లేదా తండ్రికి రూ. లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తానని, దానితో పాటు ట్రోఫిని కూడా అందజేస్తామని వెల్లడించారు.

అయితే అత్యధికంగా ఎంతమంది సంతానం కలిగి వుండాలన్నది మాత్రం మంత్రి స్పష్టంగా చెప్పలేదు. ఈ తరహా ప్రకటనను వెలువరించినడానికి మిజో వర్గంలో రానురాను తగ్గుతున్న జనాభాయే కారణమని చెప్పారు. కొన్ని రంగాల్లో నిష్టాతుతైన ఈ వర్గం తగ్గదలతో ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించలేకపోతున్నామని చెప్పారు, మిజో లాంటి గిరిజన తెగలకు ఇది సమస్యగా తయారవుతోంది. అందుకే ఈ తెగల్లో జనాభాను పెంచేందుకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్లు మంత్రి రాబర్ట్‌ రొమావియా తెలిపారు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014. దేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం మిజోరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles