Vijayammas ‘Naalo Naatho YSR’ Is A Book of Utter Lies’ విజయమ్మ ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం అబద్దాలు మిలితం: గోనె

How can vijayamma support sharmila in telangana questions gone prakash

AP CM YS Jagan, Gone Prakash Rao, Vijayamma, Sharmila, ‘Naalo Naatho YSR’, YS Rajasekhar Reddy, Ambati Rambabu, Lagadapati Rajagopal, Telangana, Andhra Pradesh, POlitics

The former APSRTC chairman strongly opposed Telangana statehood and stood by the side of late YS Rajasekhar Reddy and after his death, he was with YS Jagan. Prakash even batted for Jagan to make him CM post YSR’s death. But suddenly Prakash turned foe of Jagan and lashed out at the latter and YCP government.

విజయమ్మ ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం అబద్దాలు మిలితం: గోనె

Posted: 06/19/2021 12:14 PM IST
How can vijayamma support sharmila in telangana questions gone prakash

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం అవాస్తవాల పుట్ట అని ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అరోపించారు. జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు సవాల్ విసిన వైఎస్ జగన్ అభిమానుల సవాలును స్వీకరించిన తాను తిరుపతిలో మాట్లాడుతున్నానని, ఈ నేపథ్యంలో తాను జులైలో అమెరికాకు కూడా వెళ్లనున్నట్లు తెలిపారు. జగన్ అభిమానుల సవాల్ నేపథ్యంలోనే తాను అమెరికాకు వెళ్లి అక్కడ కూడా మాట్లాడతానని చెప్పారు.

వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్య పోల్చలేనంత వత్యాసం వుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలా పోల్చుతున్న జగన్ అభిమానులు.. వైఎస్సార్ ను అవమానించడమేనని అన్నారు. తెలంగాణలో కాకుండా దమ్ముంటే ఏపీలో విలేకరుల సమావేశం నిర్వహించాలన్న వైఎస్, జగన్ ఎన్నారై అభిమానుల సవాలును స్వీకరించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు చెప్పిన ప్రకాశ్‌రావు.. కడప జిల్లాలోనైనా మాట్లాడేందుకు తాను సిద్దమన్నారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. జగన్ బెయిలు కచ్చితంగా రద్దవుతుందని జోస్యం చెప్పారు. జగన్ అసలు రూపాన్ని బయటపెడతానని హెచ్చరించారు.

బీజేపీ అనుకుంటే ఇటు జగన్, అటు కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజద్రోహం చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో ఇప్పటి వరకు ఆ చట్టాన్ని ఉపయోగించిన దాఖలాలు లేవన్నారు. గ్రామవాలెంటీర్లకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తనదని చెప్పుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. కనీస వేతనాలు అమలు పర్చకుండా వెట్టిచాకిరిని ప్రోత్సహిస్తోందని ఆయన తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. నిజంగా వారికి ఉపాధి కల్పించిన వారి ఘనతను పోందాలంటే వారికి కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.

వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్న విజయమ్మ తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు ఎలా మద్దతు ఇస్తారని గోనె ప్రశ్నించారు. మరి ఈ విషయంలో విజయమ్మకు షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.   వైఎస్ పాదయాత్రలో జగన్ ఉన్నారని పుస్తకంలో రాయడమే అందుకు నిదర్శనమని అన్నారు. అంతేకాదు, వైఎస్ పాదయాత్రలో జగన్ కూడా వున్నారని అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌లలో ఏ ఒక్కరు నిరూపించినా తాను ఉరేసుకుంటానని గోనె ప్రకాశ్‌రావు సవాలు విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Gone Prakash Rao  Vijayamma  Sharmila  ‘Naalo Naatho YSR’  Telangana  Andhra Pradesh  Politics  

Other Articles