Month old baby girl recovered from river ganga గంగానదిలో కర్ణుడి తరహాలో పెట్టిలో తరలివచ్చిన ‘‘గంగ’’

Uttar pradesh 22 day old baby girl recovered from river ganga

CM, Yogi Adityanath, Ganga river, newborn, Girl Child, wooden box, kanakadurga devi photo, saffron coloured cloth, Ghazipur, Uttar Pradesh, Crime

A 22-day old baby girl was found abandoned in a wooden box floating in the Ganga river in Ghazipur district on Wednesday. Chief Minister Yogi Adityanath has announced that the Uttar Pradesh government will take the full responsibility of the child and will ensure its proper upbringing.

గంగానదిలో కర్ణుడి తరహాలో పెట్టిలో తరలివచ్చిన ‘‘గంగ’’

Posted: 06/16/2021 11:56 AM IST
Uttar pradesh 22 day old baby girl recovered from river ganga

మహభారతంలో కర్ణుడిని తల్లి కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన విధంగానే తాజాగా ఓ చంటిబిడ్డను చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. నదిలో ఓ చెక్కపెట్ట తేలుతూ రావడాన్ని గమనించిన స్థానికులు దానిని ఒడ్డుకు చేర్చి.. తెరచి చూస్తూ అందులో ఓ చంటిబిడ్డ దర్శనమిచ్చింది. అమెతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా ఉంది. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డతో పాటు అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. బిడ్డను తన తల్లే వదిలేసిందా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో బిడ్డ తల్లే అలా చంటిబిడ్డను చెక్క‌పెట్టెలో ఉంచి గంగానదిలో ప‌డేసిందా? లేక మరెవరైనా చేశారా? బిడ్డ జన్మించిన గడియలు అశుభమని కన్నతల్లికి తెలియకుండా కుటుంబసభ్యులు ఇలా చేశారా.? అన్న ప్రశ్నలు అనేకం వ్యక్తమవుతున్నాయి. ఘాజీపూర్ లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూతా చూశాడు. ఎక్కడా చంటిబిడ్డ జాడలేదు. కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో పరిశీలించి చూడగా..నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం గమనించాడు.

ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయా? అనే అనుమానం వచ్చింది. అంతే ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ.. నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా..షాక్ అయ్యాడు. నెలరోజుల లోపు వయస్సున్న చంటిబిడ్డ ఎర్రని వస్త్రంతో కనకదుర్గమ్మ తల్లి ఫోటోతో పాటు చెక్కపెట్టలో ఉంది. నావికుడి కేకలు విన్న స్థానికులు పలువురు అక్కడి చేరుకున్నారు. ఆ పెట్టెలో ఉన్న బిడ్డను చూసి అవాక్క‌య్యారు. ఆ పేపర్ లో ఆ బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు ‘గంగ’ అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. కాగా పెట్టెలో దొరికిన ఆడబిడ్డను గుర్తించిన నావికుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ బిడ్డను తనకు గంగమ్మే ఇచ్చింది. ఆ బిడ్డ పేరు కూడా గంగ‌ అని రాసి ఉంది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను నేను పెంచుకుంటానని చెప్పాడు.

కానీ గంగానదిలో స్థానికుడి ఓ పెట్టె దొరికిందని ఆ పెట్టలో ఆడ శిశువు ఉందని స్థానికులు పోలీసుల‌కు తెలియజేయటంతో బిడ్డ దగ్గరకొచ్చిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఆ పాపను నేను పెంచుకుంటాను సార్’..అని నావికుడు చెప్పినా ‘‘అలా కుదరదు ఈ బిడ్డ ఎక్కడనుంచి వచ్చింది? ఎవరు ఇలా బిడ్డను పెట్టెలో పెట్టి వదిలేశారు? అనే విషయాలను మేం దర్యాప్తు చేయాలి’ అంటూ ఆ బిడ్డను పోలీసులు తీసుకెళ్లిపోయారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. కాగా..గంగానదిలో పెట్టెలో ఓ చంటిబిడ్డ కొట్టుకొచ్చిందనే వార్త స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టాపిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles