VRO, Surveyor seen taking bribe from farmer రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్వో.. సర్వేయర్..

Kurnool revenue officials seen taking bribe from farmer in kowthalam mandal

VRO, Surveyor, Sridevi, bribe, Nadichagi village, kowthalam mandal, kurnool, revenue officials, Kurnool, Andhra Pradesh, Crime

The Villagers had filmed a video while Village Revenue Officer and women Surveyor are demanding bribe for doing their job and caught red-handed while accepting the bribe amount of Rs.10000 at the fields of the farmer. The corrupt official, Srivedi the surveyor and VRO were seen in the video while taking the bribe.

రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్వో.. సర్వేయర్..

Posted: 06/15/2021 06:39 PM IST
Kurnool revenue officials seen taking bribe from farmer in kowthalam mandal

ప్రభుత్వ ఉధ్యోగాలు వెలగబెడుతూ.. వేల రూపాయల జీతాలను పోందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు తాము ప్రజలు ఇచ్చే పన్నుల డబ్బుతోనే జీతాలు పోందుతున్నాం అన్న ఇంకితంతో వ్యవహరించకుండా వారిని ప్రతీ పనికి లంచం పేరుతో జలగల్లా వేధిస్తుండటం మనం చూస్తునేవున్నాం. అందులోనూ అవసరం కోసం వచ్చిన ప్రతీ ఒక్కరిని మన, తన, పర, అన్న భేధం లేకుండా హింసించడం వీరికి పరిపాటిగా మారింది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు అందులోనూ రెవెన్యూ ఉద్యోగుంటే.. పైసా ముట్టనిదే ఫైలు ముందుకు కదలదన్న అరోపణలు ఇప్పటికే చుట్టుముట్టాయి. వాటిని బాపుకునే ప్రయత్నం చేయని అధికారులు.. తమ గురించి మంచి ప్రచారం జరుగుతుందని, దీంతో తమ వద్దకు వచ్చే ప్రతీ ఒక్కరు డబ్బుతోనే వస్తారని భావిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో పొలం సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు.. అన్నదాత అయిన రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు మధ్యవర్తి ద్వారా వారికి డబ్బు అందించాడు.. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకునే సమయంలో వీడియో తీసి భద్రపరిచారు. కాగా ఆ వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం సర్వే చేసేందుకు సర్వేయర్ శ్రీదేవి, వీఆర్వో రామాంజనేయులు వచ్చారు. పొలం సర్వే పూర్తైన వెంటనే తమకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రైతు రూ.10 వేలను వేరే వ్యక్తికి ఇచ్చి పొలం వద్దకు పంపాడు.

ఈ డబ్బు వీఆర్వో చేతికి ఇచ్చాడు సదరు వ్యక్తి.. ఆ తర్వాత వీఆర్వో అందులోని ఐదు వేలు తీసి సర్వేయర్ కు ఇచ్చాడు. ఈ సమయంలో సర్వేయర్ శ్రీదేవి అంతకు ముందు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ ఇచ్చారు అంటూ.. ఇప్పుడు ఇచ్చిన ఐదు వేలు సరిపోవన్నట్లు మాట్లాడారు. వెంటనే వీఆర్వో అవన్నీ నేను చూసుకుంటా అంటు సర్వేయర్ కు చెప్పాడు. కాగా అక్కడ ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించారు.. అయితే ఆ వీడియోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఈ వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయా? లేదా? అన్నది తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VRO  Surveyor  Sridevi  bribe  Nadichagi village  kowthalam mandal  kurnool  revenue officials  Kurnool  Andhra Pradesh  Crime  

Other Articles