భారత్ లోకి చోచ్చుకోచ్చిన చైనా బలగాలను వెనక్కు తరిమే నేపథ్యంలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు వీరత్వానికి ప్రతీకగా ఆయన విగ్రహాన్ని సూర్యపేట ప్రధాన కూడలిలో ఇవాళ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో విదులు నిర్వహిస్తూ భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నాం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం ఆ వీరుడా వందనం అంటూ సెల్యూట్ చేశారు. నీ త్యాగం ఎప్పటికీ మర్చిపోం అంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత్- చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 2020 జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు వీరమరణం పొందాడు. సంతోష్ బాబుతో పాటు మరికొందరు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ నిర్ణయం ప్రస్తుతం కార్యరూపం దాల్చడంతో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా కల్నల్ సంతోష్ బాబు విగ్రహాం అవిష్కరించారు. కాగా..తెలంగాణ ముద్దు బిడ్డ సంతోష్ బాబు మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. తెలంగాణ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్న సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా ఇచ్చి గౌరవించింది. అలాగే హైదరాబాద్ లో ఓ స్థలాన్ని కూడా కేటాయిచిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more