After Delhi visit, focus is now on shift to Vizag మూడు రాజధానుల ఏర్పాటుకు స్పీడు పెంచిన ప్రభుత్వం

Committed to three capitals balanced regional development jagan

YS Jagan Mohan Reddy, AP Capital Issue, decentralisztion, three capitals. Amaravathi. Kurnool. Visakhapatnam, YS Jagan, Sajjala Ramakrishna Reddy, TDP, Prakash Javadekar, piyush goyal, PDS, Niti Ayog, Dharmendra Pradhan, amit shah, Amaravati News, Amaravati, Andhra Pradesh News, Andhra Pradesh, politics

With the successful conclusion of Delhi visit, Chief Minister YS Jagan Mohan Reddy is likely to start functioning soon from Visakhapatnam, the executive capital. Buoyed by the smooth and successful interactions with Amit Shah and other Union Ministers, the Chief Minister is likely to make a move towards making his 3-captials decision a reality

మూడు రాజధానుల ఏర్పాటుకు స్పీడు పెంచిన ప్రభుత్వం

Posted: 06/12/2021 11:42 AM IST
Committed to three capitals balanced regional development jagan

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తిన పర్యటన విజయవంతంగా ముగిసిన వెంటనే ఆయన అడుగులు మూడు రాజధానుల వైపు పడుతున్నాయి. ఇక ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగగా గ్రీన్ సిగ్నల్ లభించిన్నటు వార్తలు వెలువడుతున్నాయి. వైసీపీ కీలక నేతల వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే మూడు రాజధానుల పాలన అమల్లోకి వచ్చేట్టు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు కేంద్ర మంత్రులతో పాటు కేంద్రంలోని పెద్దల నుంచి కూడా పచ్చజెండా లభించినట్టేనన్న సంకేతాలను వెలువర్చుతూ.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుగా దిశగా కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. త్వరలో విశాఖ పాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ గా వెంటనే అమల్లోకి తీసుకుని రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా చేయగా.. కేంద్రం ప్రభుత్వం నుంచి పాలన అనుమతులు రావాల్సి ఉంది. జగన్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో ఈఅంశంపైనే చర్చ జరిగింది.

ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో పాలనా అనుమతులు వస్తాయని చెప్పడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అధికార వికేంద్రీకరణ చేయడం ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, మూడు రాజధానుల నిర్ణయం పంతానికి చేసింది కాదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. జగన్ పర్యటన వ్యక్తిగతం కాదని, రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగిందని అన్నారు. శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రద్దు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సజ్జల పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles