Anandaiahs medicine distributed to every house వాలెంటీర్లతో ఆనందయ్య మందు ఇంటింటికీ పంఫిణీ..

Anandaiahs corona medicine distributed to every house in manubolu

Anandaiah, ayurvedic corona medicine, Krishnapatnam medicine, kakani govardhan reddy, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

Affter all the hurdles cleared for Anandaiah's K medicine with Andhra Pradesh High Court gave the green signal to the medicine, Now the village Volunteers distributing the medicine to every House. It is learnt that the Police department had lifted 144 section in Krishnapatna,

ఆనందయ్య మందు ఇంటింటికీ పంఫిణీ.. కృష్ణపట్నంలో 144 సెక్షన్ ఎత్తివేత

Posted: 06/08/2021 01:01 PM IST
Anandaiahs corona medicine distributed to every house in manubolu

తన అయుర్వేద ఔషదంతో కరోనా బాధితులకు నిమిషాల వ్యవధిలో ఉపశమనం కల్పిస్తూ పేదల నుంచి పెద్దల వరకు క‌రోనా రోగుల‌ పాలిట ఆరాద్యుడిగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తన మందును పంఫిణీ చేస్తున్నారు. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నిన్న ఆనందయ్య కె మందుకు పచ్చజెండా ఊపుతూ తక్షణం ఆయన తన మందును పంఫిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అదేశాలను జారీ చేసిన క్రమంలో ఆయన నిన్నటి నుంచే మందుకు పంఫిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కృష్ణపట్నంలో మందును తీసుకునేందుకు వచ్చిన వారి మధ్య తొక్కిసలాట కూడా జరిగింది.

హైకోర్టు అదేశాల నేపథ్యంలో ఆనందయ్య తన మందును ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందించారు. అయితే క్యూ పద్దతిలో ప్రజలు మందు కోసం వస్తే తోపులాట జరుగుతుందని భావించిన జిల్లా యంత్రాంగం.. ఇక ఇవాళ్టి నుంచి గ్రామ వాలెంటీర్లతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంఫిణీ చేయిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు చెందిన గ్రామ వాలెంటీర్లకు ఆనందయ్య తన మందును అందించగా వారు ఇంటింటికీ వెళ్లి తమ గ్రామవాసులకు మందును అందిస్తున్నారు. నిన్న సర్వేపల్లిలో మందును పంచిన గ్రామ వాలెంటీర్లు ఇవాళ నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలంలో పంఫిణీ చేస్తున్నారు.

వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ ఔష‌ధాన్ని పంఫిణీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్‌ లోని మందు, క‌రోనా రాని వారికి ముందు జాగ్ర‌త్త‌గా నీలం రంగు ప్యాకెట్‌ లోని మందును ఇస్తున్నారు. మ‌రోవైపు, కృష్ణ‌ప‌ట్నం పంచాయ‌తీ ప‌రిధిలో 144 సెక్ష‌న్‌ను తొల‌గించారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేయ‌నున్నారు. కాగా, ఇతర ప్రాంతాల కరోనా రోగులకు ఆనందయ్య ఎప్పట్నించి మందును పంఫిణీ చేస్తారన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆన్ లైన్ ద్వారా మందును ఎప్పడ్నించి అందుబాటులోకి వస్తుందన్న వివరాలు తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles