NACH payments to be available on all days of the week ఇకపై నిర్ణీత తేదీల్లోనే వేతనాలు..

National automated clearing house to be available on all days from august 1 rbi

rbi, rbi mpc, nach payment timing, NACH, Reserve Bank of India, RBI, National Automated Clearing House, RBI data, Salaries, EMIs, RTGS, payments

RBI said NACH has emerged as a popular and prominent digital mode of direct benefit transfer (DBT) to a large number of beneficiaries, helping the transfer of government subsidies during the present COVID-19 in a timely and transparent manner.

ఆగస్టు 1 నుంచి నిర్ణీత తేదీల్లోనే వేతనాలు.. రుణాల చెల్లింపులు: ఆర్బీఐ

Posted: 06/05/2021 12:38 PM IST
National automated clearing house to be available on all days from august 1 rbi

భారతీయ రిజర్వు బ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాల గురించి సమాచారం మీడియాకు తెలిపిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ సందర్భంగా నూతనంగా అమల్లోకి తీసుకువచ్చే నిర్ణయాన్ని కూడా తెలిపారు. ఇకపై వారానికి ఏడు రోజుల పాటు నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(నాచ్) సౌకర్యం రాబోతుంది. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో షెడ్యూల్ చేసిన తేదీన బ్యాంకులు సెలవు రోజు అయినా ఇకపై జీతాలను అందుకునేందుకు, లేదా రుణాల చెల్లింపులు అటోమెటిక్ గా జరగనున్నాయి. అదివారం వచ్చిందనో లేక సెలవు రోజు కావడంతోనే ఇప్పటివరకు జీతాలు ఒక్క రోజు ముందగానే చెల్లించేలా చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వరంగ సంస్థలు.

అయితే కొన్న ప్రైవేటు సంస్థలు మాత్రం సెలవునే సాకుగా చూపుతూ ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వేతనాలను అందిస్తున్నాయి. నాచ్ ఇకపై వారంలో ఏడు రోజుల పాటు పనిచేయనుండటంతో సెలవులు వచ్చినా.. అదివారాలు అయినా.. లేక బ్యాంకులు మూసివేసి సరిగ్గా సమయానికి జీతం వేతనాల రోజునే అకౌంట్లో పడిపోనున్నాయి. ఇంటి లోన్, ఆటో లోన్ మరియు వ్యక్తిగత రుణంతో సహా ఏ రకమైన ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్(EMI) ఉన్నా.. అదేరోజున అకౌంట్ నుంచి తీయబడుతుంది. ప్రస్తుతం నాచ్ సేవలు.. బ్యాంకులు తెరిచిన రోజుల్లోనే అందుబాటులో ఉండగా.. కస్టమర్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్‌ వెల్లడించింది. నాచ్‌ చెల్లింపుల విధానంలో జీతాలు, పింఛన్లు, వడ్డీలు, డివిడెండ్‌లు వంటి చెల్లింపులు జరుగుతూ ఉంటాయి.

డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానం వచ్చాక నాచ్‌ నమ్మకమైన, సమర్థవంతమైన మార్గంగా మారింది. గ్యాస్‌, విద్యుత్తు, టెలిఫోన్‌, వాటర్‌, వాయిదాల చెల్లింపులకు కూడా నాచ్‌నే వాడతారు. ఇప్పటికే ఆర్టీజీఎస్‌ అన్ని రోజులు అందుబాటులోకి రాగా.. నాచ్‌ను కూడా అన్ని రోజులు పనిచేసేలా చేస్తున్నారు. అయితే, లోన్లు తీసుకున్న కస్టమర్లకు ఒక ప్రయోజనం ఏమిటంటే, వారు నిర్ణీత తేదీకి వారి అకౌంట్లో EMI మొత్తాన్ని కలిగి ఉండకపోతే, బ్యాంక్ సెలవుదినం మరియు నెలసరి వాయిదా ఉన్న సందర్భంలో మరుసటి రోజు తీయబడుతుంది. నాచ్ సౌకర్యం ప్రతీరోజూ లభించకపోవడం వల్ల చాలా సార్లు నిపుణులు తమ జీతం, వివిధ రకాల డివిడెండ్ మరియు వారి ఖాతాలో వడ్డీని పొందలేకపోతున్నారు. జీతాలు తీసుకునేరోజు సెలవు వస్తే.. తర్వాతి రోజు వరకు ఉద్యోగస్తులు ఆగాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇకపై ఉండదు అని ఆర్‌బీఐ చెబుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles