Criticism of government by media not seditious: SC రాజద్రోహం సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్న రాష్ట్రాలు: సుప్రీం

Supreme court sedition law needs relook especially for media

Freedom of Press, TV5, ABN Andhrajyothi, Andhra Pradesh TV channels, Supreme court, Sedition law, supreme court sedition law, right of press, free speech, SC News. RaghuramaKrishna Raju, Andhra Pradesh, Crime

RESTRAINING THE Andhra Pradesh police from taking coercive action against two TV news channels charged with sedition, the Supreme Court Monday said it is of the view that section 124A of the IPC, which deals with the offence, will need interpretation — especially on its application with regard to freedom of the press.

ఏబీఎన్, టీవీ5లపై రాజద్రోహం కేసు: పత్రికా స్వేచ్చను హరించడం కాదా.?: సుప్రీం

Posted: 05/31/2021 06:54 PM IST
Supreme court sedition law needs relook especially for media

దేశసర్వోన్నత న్యాయస్థానంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మీడియా సంస్థలపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని, పరిమితులను పునర్విచారించాల్సిన అవసం వుందని అభిప్రాయపడింది. ఈ కేసు తదుపరి విచారణ వరకు మీడియా సంస్థలపై కానీ, సంస్థ ప్రతినిధులపై కాని ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని న్యాయస్థాన ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసును నమోదు చేసిన ఏపీ సీఐడీ, అదే సమయంలో ఆయన మీడియా సమావేశాలను ప్రసారం చేసిన రెండు మీడియా ఛానెళ్లపై కూడా ఏసీబి రాజద్రోహం కింద కేసులు నమోదు చేసింది.

దీంతో ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కింద తమపై ఏసీబితో కేసులు నమోదు చేయంచడాన్ని సవాలు చేసిన తెలుగు వార్తా ఛానళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ బెంచ్ లో జస్టిస్ చంద్రచూడ్ తో పాటు... జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ఉన్నారు. కేసు విచారణ సందర్భంగా మీడియా సంస్థలపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఈ తరహాలో కేసులు నమోదు చేయడం మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంలా (muzzle media freedom)  ఉందని  వ్యాఖ్యానించింది. దేశద్రోహం చట్టానికి సంబంధించిన పరిమితులను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు ఛానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని విచారణ సందర్భంగా ఛానళ్ల తరపు న్యాయవాదులు సుప్రీంను కోరారు. దీంతో, ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ... తదుపరి విచారణ వరకు  ఈ రెండు ఛానళ్లపై కానీ, వాటి సిబ్బందిపై కానీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది.  ప్రతి రాష్ట్రం దేశద్రోహం కేసును దుర్వినియోగం చేస్తోందని... ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపింది. రాజద్రోహం కేసుల నమోదుపై తాము పూర్థి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles