Lockdown in Andhra Pradesh extended until June 10 ఆంధ్రప్రదేశ్లోనూ జూన్ 10 వరకు లాక్ డౌన్ పోడగింపు

Andhra pradesh covid lockdown extended until june 10

Andhra lockdown, AP lockdown, Andhra Pradesh lockdown update, Andhra lockdown extended, Jagan extends lockdown, Coronavirus lockdown in Andhra Pradesh, Chittoor lockdown, Andhra covid curfew, Andhra Pradesh, Politics

A day after the Telangana government extended the state-wide lockdown by 10 days, the government of neighbouring Andhra Pradesh also announced that the partial lockdown in the state will be in effect until June 10, with the exception of Chittoor district, which will be under lockdown until June 15.

చిత్తూరు మినహా ఆంధ్రప్రదేశ్లోనూ జూన్ 10 వరకు లాక్ డౌన్ పోడగింపు

Posted: 05/31/2021 02:56 PM IST
Andhra pradesh covid lockdown extended until june 10

తెలంగాణ రాష్ట్రం జూన్ 9 వరకు లాక్ డౌన్ పోడిగించిన నేపథ్యంలో పోరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడిచింది. లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నాయి, ఈ బాటలో తెలంగాణ ప్రభుత్వం పయనించించి లాక్ డౌన్ ను జూన్ నెల 9 వరకు పోడిగించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని బాగా కట్టడి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

అయితే కర్ప్యూ నేపథ్యంలో ప్రస్తుతం మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజావసరాల కోసం సడలింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ కొనసాగించడం వల్ల కరోనా ప్రభావాన్ని మరింత తగ్గించవచ్చని ఆరోగ్యశాఖ అధికారులతో పాటు మంత్రివర్గం కూడా అభిప్రాయపడింది.

దీంతో సీఎం జగన్ నేతృత్వంలోని క్యాబినెట్ మరో పది రోజుల పాటు రాష్ట్రంలో కర్ప్యూను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని మీడియాకు వెలువరించిన అనంతరం మధ్యాహ్నం 12 తరువాత రాష్ట్రంలో మరుసటి రోజు ఉదయం వరకు కర్ప్యూ కఠినంగా నిర్వహించాలని అదేశించినట్టు తెలిపింది. ఏపీలో గత వారం రోజులుగా కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. రోజువారీ కేసులు 15 వేలకు లోపే వస్తున్నాయి. వ్యాక్సినేషన్ ఊపందుకుంటే కరోనా మహమ్మారిని మరింత ప్రభావవంతంగా కట్టడి చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  second wave  curfew imposed in AP  Andhra covid curfew  Andhra Pradesh  Politics  

Other Articles