Kapra official held for taking bribe లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన ఢీఈ మహాలక్ష్మీ

Kapra deputy executive engineer held for taking bribe

acb, anti-corruption bureau, hyderabad, kapra circle deputy engineer mahalaxmi, salamma, Hyderbad, Telangana, Crime

The Anti Corruption Bureau caught an official working with the GHMC when she demanded and accepted a bribe of Rs. 20,000 from a person for doing official work. Mahalakshmi, Deputy Executive Engineer GHMC Kapra Circle had demanded the bribe from a woman Saleema whose husband had passed away while on duty a few months ago.

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన ఢీఈ మహాలక్ష్మీ

Posted: 05/31/2021 12:36 PM IST
Kapra deputy executive engineer held for taking bribe

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. ఎంతో సంపన్నమైన వారితో పాటు నిలువనీడకు కూడా కరువైన పేదలను కూడా వదలడం లేదు. ఎంత డబ్బులున్నా ప్రాణాలను దక్కించలేని పరస్థితులు నెలకొన్నాయి. దీంతో అనేక మంది సంపన్నులు కూడా తమ వంతుగా లేనివారికి సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుతుంటే.. తమ మున్సిపాలిటీ పరిధిలో ఓ మహిళా అధికారిని మాత్రం కారుణ్య నిమాయకంగా చనిపోయిన భర్త ఉద్యోగాన్ని భార్యకు ఇచ్చేందుకు ఏకంగా లంచాన్ని డిమాండ్ చేసింది. తమ జీహెచ్ఎంసీలో దిగువస్థాయి సిబ్బంది నుంచి కూడా అమె లంచాన్ని డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు.

భర్త పోయి పుట్టెడు దు:ఖంలో వున్న ఆ కుటుంబానికి అసరాగా నిలువకపోయినా పర్యావేలేదు కానీ.. అసలు పెద్ద దిక్కుపోయిన కుటుంబాన్ని మరింత అర్థికంగా కుంగదీసేలా రూ. 20 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో డీఈ మహాలక్ష్మి అడ్డంగా బుక్కయ్యారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దీంతో, ఆమె నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ, కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని మల్లాపూర్ లో స్వీపర్ గా పని చేస్తున్న రాములు చనిపోయాడు.

దీంతో ఆయన భార్య సాలెమ్మకు ఉద్యోగం వచ్చిందని... ఉద్యోగం ఇప్పించినందుకు సాలెమ్మను మహాలక్ష్మి రూ. 20 వేలు డిమాండ్ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సాలెమ్మ కుమారుడు శ్రీనివాస్ తమకు ఫిర్యాదు చేశాడని... ఈరోజు  రూ. 20 వేలు ఇస్తుండగా మహాలక్ష్మిని పట్టుకున్నామని తెలిపారు. మహాలక్ష్మి అసిస్టెంట్ విజయ మల్లాపూర్ లోని యాదగిరి ఫంక్షన్ హాల్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. అనంతరం మహాలక్ష్మి కార్యాలయంతో పాటు చక్రపురి, నాగారంలో ఉన్న ఆమె నివాసాల్లో సోదాలు చేస్తున్నామని... ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన లెక్కల్లో లేని బంగారం, నగదును గుర్తించామని తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles