Call off strike, govt will fulfill just demands: KCR జూనియర్ డాక్టర్ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఆదేశం

Ts govt ready to address legitimate issues of junior doctors cm kcr

junior doctors strike call, junior doctors boycott medical services, junior doctors boycot emergency services, Health officials Junior doctors strike, cm kcr health officials meet, junior doctors pandemic, junior doctors legitimate issues, chief minister k chandrashekhar rao, health officials, junior doctors, legitimate issues, CM KCR, Strike call, Telangana

Chief Minister K Chandrashekhar Rao urged the junior doctors to call off their strike and join duty immediately considering the serious situation on account of Covid-19 pandemic and other public health issues.

జూనియర్ డాక్టర్ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఆదేశం

Posted: 05/26/2021 06:27 PM IST
Ts govt ready to address legitimate issues of junior doctors cm kcr

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టి ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను పరిస్కరించాల్సిందిగా కోరడంతో ప్రభుత్వ కూడా దిగివచ్చింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లు.. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ర్ట వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చమని తమ డిమాండ్ల పరిష్కారానికి మరో మార్గం లేక కరోనా నేపథ్యంలోనే సమ్మనోటీసు ఇవ్వక తప్పడం లేదని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు.

అయితే యావత్ ప్రపంచమంతా కరోనా మహమ్మారి గురించి అలోచించి పరిశోదనలు చేస్తూ, రోగులకు చికిత్స అందిస్తున్న కష్టకాలంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడం సముచితం కాదని, వెంటనే విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వారికి సూచించినా జూనియర్ డాక్టర్లు పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు జూనియర్ డాక్టర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాయి, దీంతో ఆయన సంబంధిత వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని… తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

జూనియర్ డాక్టర్లపై ఏనాడు ప్రభుత్వం వివక్ష చూపలేదన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తూనే ఉందని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఈ సందర్భంగా వారి సమస్యలపై ఆరా తీశారు. తక్షణమే జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వైద్య సేవల్లో కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు కూడా…సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం అందించాలని సూచించారు. జుడాలు, వారి కుటుంబీలకు నిమ్స్ లో మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. నిబంధనల మేరకు ఎక్స్ గ్రేషియా కూడ సత్వరమే అందించాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles