Tata Steel Big Desicion for its Employees families కోవిడ్ తో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు వేతనాలు

Tata steel to pay salary to families of employees who succumbed to covid 19

tata steel, tata steel news, tata steel India, tata steel employees salary, tata steel employee salary covid-19, tata steel salary employee dead COVID-19

Tata Steel has announced that it will continue to pay monthly salary to the families of all employees who have passed away due to coronavirus. The Jamshedpur-based steel manufacturer explained that the firm will continue to pay these salaries till the retirement age of the deceased, which is 60 years.

టాటా స్టీల్ పెద్ద మనసు: కోవిడ్ తో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు వేతనాలు

Posted: 05/25/2021 03:20 PM IST
Tata steel to pay salary to families of employees who succumbed to covid 19

కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతోంది. దేశాల అర్థిక పరిస్థితులనే తలక్రిందులు చేసేలా పంజా విసిరిన ఈ మహమ్మారి ధాటికి గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ ఫ్రకటించాయి. అయితే ఈ ఏడాది భారత్ లో కరోనా మహమ్మారి రెండో దశ దెబ్బ తీవ్రంగా వుంది. గత ఏడాది సకాలంలో లాక్ డౌన్ విధించడంతో తగ్గిన మరణాలు.. ఈ ఏడాది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలేయడంతో దాదాపుగా కరోనా మహమ్మారి జడలు విప్పిన తరువాత కానీ రాష్ట్రాలు లాక్ డౌన్ పై దృష్టి సారించలేదు. దీంతో అనేక కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయాయి.

అయితే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం అనాధలైన పిల్లలకు, ఆర్జించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు దేశంలో ఏ సంస్థ, పరిశ్రమ ప్రకటించని విధంగా టాటా స్టీల్ మాత్రం తమ పెద్ద మనసును కనబర్చింది. ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలుపుతూ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రకటించింది. కంపెనీ అనౌన్స్ చేసిన స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులెవరైనా కొవిడ్ తో చనిపోతే వారు పదవీ విరమణ పోందే వరకు ఆ కుటుంబానికి వేతనాన్ని అందిస్తామని తెలిపింది.

అంతేకాకుండా బతికి ఉండగా అందించిన మెడికల్ బెనిఫిట్స్, హౌజింగ్ ఫెసిలిటీలను కూడా అందిస్తారు. దీంతో పాటుగా ఫ్రంట్ లైన్ ఉద్యోగి కొవిడ్ ఇన్ఫెక్షన్ కు గురై ఉద్యోగం కోల్పోయి చనిపోతే వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను గ్రాడ్యుయేషన్ వరకూ మొత్తం సంస్థనే భరిస్తుంది. ‘టాటా స్టీల్ అగిలిటీ విత్ కేర్’ (#AgilityWithCare) అనే పేరుతో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ను ఉద్యోగి కుటుంబ సభ్యులకు అందజేసేందుకు విస్తరిస్తూ వస్తుంది. తమకు తోచినంత తాము చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్లు ఈ క్లిష్ట సమయంలో ఇతరులకు సహాయం చేస్తారని ఆశిస్తున్నామని టాటా స్టీల్ ట్విట్ లో కోరింది. ఈ ప్రకటనతో టాటాస్టీల్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles