మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరప్ చేసిన ఆయన ఇలాకాలో టీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వర్గాలకు ఆయన వెంటే వుంటూ తమ స్వామిభక్తిని చాటుకోగా, పార్టీలో ఆయన వర్గం వెళ్లిపోవడంతో ఇప్పుడైనా తమకు సముచితస్థానం దక్కుతుందని అశిస్తున్న క్రియాశీలక నేతలకు మధ్య పోరపచ్చాలు కూడా వచ్చేశాయి, అయితే ఆయన ఉద్వాసనకు గురైన నేపథ్యంలో ఇక పార్టీని ముందుకు నడిపే నాయకుడు ఎవరన్న విషయంలో పార్టీ కార్యకర్తలు నిరాశ, నిసృహలకు లోను కాకుండా టీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది.
తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్వరం పెంచారు. పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల దాడి చేసిన ఆయన తన నియోజకవర్గంలోని తన అనుచరులను టార్గెట్ చేస్తున్న బిసి సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, తెలంగాణ ప్రభుత్వంతో పాటు..సీఎం కేసీఆర్ పైన కూడా విమర్శలు కొనసాగించారు. తనపై కక్ష కట్టి కావాలని తనను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేశారనీ.. అయినా తన పని తాను చేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా పలువురు పార్టీ నేతలను కలుస్తున్నానని, అయితే తన పనికి విఘాతం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెద్దలు తనను ఇంకా ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు,
తనను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని,, తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుండటంతో.. ఇక తాజాగా రూటు మార్చి తనవారిని కూడా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దీనిన ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని ఈటెల హెచ్చరించారు. తన ప్రజలను తనవారిని తన మద్దతుదారులను సమస్యలకు గురిచేస్తే సహించబోనని ఈటెల వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నారు కదాని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారనీ.. కానీ అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమాలాకర్ పై తీవ్రస్థాయిలో ఈటెల ఫైర్ అయ్యారు.
‘‘బిడ్డా గంగులా... నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు?, నీ కథ మొత్తం నాకు తెలుసని... సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని... 2023 తర్వాత నీవు ఉండవని’’ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కరీంనగర్ సంపదను విధ్వంసం చేసి, జిల్లాను బొందలగడ్డగా మార్చావని ఈటల దుయ్యబట్టారు. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని... ఇలాంటి చరిత్ర తనది కాదని అన్నారు. గంగుల లాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత, సంస్కారం ఉండాలని అన్నారు. హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more