Cyclone Tauktae Crosses Gujarat Coast, Weakens తీరం దాటిన ‘తౌక్టే’.. గుజరాత్ అతలాకుతళం.. మునకేసిన ముంబై..

Cyclone tauktae storm weakens strong wind and rain hammer gujarat

Indian Meteorological Department (IMD), cyclone, Cyclone Tauktae, Cyclone Tauktae,Cyclone Tauktae landfall, Gujarat, Mumbai rain, Cyclone Tauktae status, Cyclone Tauktae latest news,Cyclone Taukate weakens,Cyclone Taukate landfall in Gujarat, severe rainfall alert, bangalore weather, mumbai weather, imd satellite, cyclone in kerala, cyclone in mumbai, imd weather, Kerala, Karnataka, Maharashtra, Gujarat, Vijay Rupani, Telangana, Andhra Pradesh, crime

Gujarat chief minister Vijay Rupani today informed that three people have lost their lives in the state due to extremely severe cyclone, Tauktae. Around 40,000 trees have fallen and 16,500 huts affected in the state, he said. Now, the cyclone has weakened from extremely severe to very severe. It will further weaken in about two hours.

తీరం దాటిన ‘తౌక్టే’.. గుజరాత్ అతలాకుతళం.. మునకేసిన ముంబై..

Posted: 05/18/2021 08:30 PM IST
Cyclone tauktae storm weakens strong wind and rain hammer gujarat

అరేబియా సముద్రంలో లక్షద్వీస్ వద్ద ఏర్పడిన తౌక్టే పెను తుపాను తీవ్రరూపం దాల్చి కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో పెను బీభత్సం సృష్టించిన మీదట నిన్న రాత్రి గుజరాత్ ను తాకింది. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు గుజరాత్ లోని సౌరాష్ట్రలో తీరాన్ని దాటింది. గుజరాత్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రెండు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తక్కువగా వుంది. గుజరాత్ లోనూ తుఫాను ధాటికి ముగ్గరు మృతిచెందారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. తౌక్టే సృష్టించిన విలయంతో రాష్ట్రంలో ఏకంగా 40 వేల భారీ వృక్షాలు నెలకూలాయని, 16వేల 500 పూరిళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు.

కాగా తీరం ధాటిన తరువాత తౌక్టే తుపాను క్రమంగా బలహీన పడుతోందని, అతి తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారిందని, మరో రెండు గంటల వ్యవధిలో ఇది వాయుగుండగా మారుతుందని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అనేక ఇళ్లను నేలకూల్చడంతో వేలాంది మంది నిరాశ్రయులను చేసింది. ఈదురుగాలులు మాత్రం ఇప్పటికీ బలంగా వీస్తున్నాయని, అరేబియా సముద్రంలో అలలు కూడా తుపాను తీరం దాటినా ఇంకా ఎగసిపడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తౌక్టే తుపాను ఇవాళ ఉదయం సౌరాష్ట్ర వద్ద.. దియూ సుమారు 80 కీలోమీటర్ల ఉత్తర ఈశాన్య దిశగా, అమ్రేలికి సుమారు 25 కిలోమీటర్ల దిశగా పయనించిందని అధికారులు తెలిపారు.

ఇక తుపాను ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్, దాద్రి, చాప్రౌలా, హాపూర్, మీరట్, మోదీనగర్, పిలక్వా, కేక్రా, హిండన్ ఏఎఫ్ స్టేషన్, మొరాదాబాద్, హత్రాస్, ఫిరోజాబాద్, బదాయున్, అలిఘర్, సికింద్రా రావు, నరోరా, రాయా, ఐగాల్స్, గులోతి, అరౌలి, కాష్ గంజ్, మధుర, సహాస్ వాన్; నంద్ గావ్, బార్ సానా, కుర్ జా, పహాసు, తుండ్లా, ఆగ్రా, ఈతహా, జాట్టారీ, జజావు, బిలారీ, జహంగిరాబాద్, సదాబాద్, బారౌత్ తదితర ప్రాంతాలల్లో ఓ మెస్తారు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. వీటితో పాటు అటు రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని తెలిపారు.

హర్యానాలోని హోడల్, కోస్లీ, ఝాజర్, ఫారుఖ్ నగర్, బులంద్షహర్, బావల్, నూహ్, తిజారా, చక్రీ, దాద్రి, ఔరంగాబాద్, పాల్ వాల్, రెవరీ, భీవండీ, మనేసర్, సోహ్నా, నార్నుల్, మహేందఘర్ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తాయని తెలిపారు. ఇక ఇటు రాజస్థాన్ లోని బయానా, మెహందీపూర్, అల్వార్, మహ్వా, దౌస, కొట్ పుత్లీ, రాజ్ గర్, విరాట్ నగర్, ఖైర్ థాల్, నాగౌర్, జున్ జున్హు, పిలానీ, నద్బాయ్ తదితర ప్రాంతాల్లోనూ మోస్లారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జాతీయ విప్తతు నివారణ దళం ముఖ్యఅధికారి ఎస్ఎన్ ప్రధాన్ మాట్లాడుతూ గుజారత్ లో మరణాలు సంభవించలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  Cyclone Tauktae  Lakshadweep islands  Kerala  Karnataka  Goa  Maharashtra  Gujarat  Telangana  

Other Articles