Scientists agree Covid is airborne గాలి ద్వారా కూడా సోకుతున్న కరోనా వైరస్

Scientists agree covid is airborne want overhaul of ventilation systems

corona spread by air, novel virus, Ventilation, Coronavirus, covid-19, air borne corona, WHO, Scientists, Centre for disease control and prevention, Corona second wave, Coronavaccine, Covaxin, coronavirus, coronavirus cases, airborne coronavirus, ventilation systems, coronavirus spreads through air, coronavirus transmission, coronavirus is airborne

A quiet revolution has permeated global health circles. Authorities have come to accept what many researchers have argued for over a year: The coronavirus can spread through the air. That new acceptance, by the World Health Organization and the U.S. Centers for Disease Control and Prevention, comes with concrete implications

గాలి ద్వారా కూడా సోకుతున్న కరోనా వైరస్.. వెంటిలేషనే మార్గమన్న శాస్త్రవేత్తలు

Posted: 05/17/2021 11:04 PM IST
Scientists agree covid is airborne want overhaul of ventilation systems

కొవిడ్ మహమ్మారి సోకకుండా తప్పించుకునేందుకు సామాజిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్ వాడటం, నిత్యం మాస్క్ పెట్టుకుని ఉండటం మంచిదని ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే చెబుతున్నారు. అయితే కరోనా గాలి ద్వారా కూడా వ్యాపి చెందుతోందని గతకొంతకాలంగా శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అది అంతపెద్ద స్థాయిలో లేదని వైధ్యాధికారులు ఆ వాదనలను తోసిపుచ్చారు. కానీ తమ వాదనల్లో నిజం వుందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ గాలి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి జరగవచ్చని అంగీకరిస్తున్నాయి.

ఒకవేళ అదే నిజమైతే గాల్లో వైరస్‌ను నియంత్రించడం ఎలా..? తీవ్రతను తగ్గించేదెలా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం కాగా, అందుకు వెంటిలేషన్‌ ఒకటే మార్గమని పరిష్కారాన్ని కూడా చూపుతున్నారు సైంటిస్టులు. 1800వ సంవత్సరంలో పైపుల నుంచి కలరా వ్యాపించిందని గుర్తించినప్పుడు.. నీటి సరఫరాను సరిచేసిన విధంగా.. వెంటిలేషన్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంటి లోపల గాలి స్వచ్ఛంగా ఉండటం వల్ల కరోనా మాత్రమే కాకుండా.. ఫ్లూ, ఇతర శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించొచ్చని చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ లిదియా మోరావ్ స్కా కెప్టెన్సీలో 14 దేశాలకు చెందిన 39 మంది సైంటిస్టులు కరోనాపై సుదీర్ఘ అధ్యయనం చేసి తమ పరిశోధనలను వెల్లడించారు. దగ్గడం, తుమ్మడం, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం, పాటలు పాడటం వంటివి చేసినప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్‌ కణాలు బయటకు విడుదల అవుతాయి. అందులో పెద్దకణాలు కిందకు పడిపోగా, కంటికి కన్పించని చిన్న చిన్న ఏరోసోల్స్‌ కణాలు మాత్రం గాల్లో ఉండిపోతాయి. తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగాన్ని బట్టి అవి ప్రయాణిస్తుంటాయి.

గాల్లో ఎక్కువ గంటల పాటు ఉండిపోవడంతో పాటు గదుల్లో తొందరగా వ్యాపిస్తుంటాయి. భవనాల్లో వెంటిలేషన్‌ పెంచడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించొచ్చని అంటున్నారు. కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టడంపై డబ్ల్య హెచ్ వో ఇప్పటివరకు రెండు సార్లు గైడ్ లైన్స్‌ను సవరించింది. ఎప్పుడూ మూసి ఉండే గదుల్లో ఏరోసోల్స్‌ ఎక్కువ కాలం గాల్లో ఉంటున్నాయని, అందువల్ల ఇండోర్‌లో పనిచేసే వారిలో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజులు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles