Sanofi, GSK Say Covid Vaccine Shows Positive Result సనోఫి, జీఎస్కే టీకా రెండో దశ ఫలితాలు ఫలప్రదం..

Sanofi gsk covid vaccine candidate sees strong immune response in vaccine trial

corona vaccine, coronavirus, France, sanofi, Britain, Glaxo Smith Kline, Coronavirus, Covid Crisis, covid-19, E pass for corona vaccine, sanofi vaccine, gsk vaccine, covid vaccine, vaccine trials, gsk pharma, sanofi india, covid-19

An experimental COVID-19 vaccine developed by Sanofi and GlaxoSmithKline showed a robust immune response in early-stage clinical trial results, enabling them to move to a late-stage study, the French drugmaker said on Monday.

సనోఫి, జీఎస్కే టీకా రెండో దశ ఫలితాలు ఫలప్రదం.. త్వరలో 3 దశ ప్రయోగాలు..

Posted: 05/17/2021 10:24 PM IST
Sanofi gsk covid vaccine candidate sees strong immune response in vaccine trial

కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ విజృంభన ఇదివరకే పలు విదేశాలలో విలయాన్ని సృష్టించింది. ఇక తాజాగా భారత్ లోనూ రెండో దశ కోరలు చారి అనేకమందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి తాజాగా కాసింత నెమ్మదించింది. అయితే దానిని సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు వాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిపై మరింత అధ్యయనం చేస్తున్న సంస్థలు ఇప్పటికీ వాక్సీన్లు రూపోందించే పనిలో నిమగ్నమయ్యాయి. వీటిలో రష్యాకు చెందిన స్పూట్నిక్ వి, భారత్ కు చెందిన కోవిషీల్డ్, కోవాగ్జిన్, అమెరికా బయో ఎన్ టెక్, ఆస్ట్రాజెనికా సంస్థలు రూపోందించిన ఫైజర్ సహా పలు వాక్సీన్లు ఇప్పటికే ప్రజలు తీసుకుంటున్నారు.

ఇక వీటికి తోడు జాన్సన్ అండ్ జాన్సన్ సహా పలు సంస్థలు పరిశోధనలు ముగించి ట్రయల్స్ కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఫ్రాన్స్ సంస్థ సనోఫి, బ్రిటన్ దిగ్గజ సంస్థ గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్కే) సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మంచి ఫలితాలనిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఆయా సంస్థలు సంయుక్తంగా టీకా పనితీరుపై ప్రకటన జారీ చేశాయి. ఆ ట్రయల్స్ లో కరోనాను నిరోధించే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) భారీగా ఉత్పత్తయ్యాయని కంపెనీలు ప్రకటించాయి. 722 మందిపై ట్రయల్స్ చేశామని, పెద్ద వారిలో మంచి ఫలితాలు కనిపించాయని చెప్పాయి. గత ఏడాది కొన్ని అనివార్య కారణాలతో వారి వ్యాక్సిన్ పరిశోధనకు బ్రేకులు పడగా.. మళ్లీ వెంటనే తేరుకుని రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయి.

ఈ ఫలితాలిచ్చిన ఉత్సాహంతో రాబోయే కొన్ని రోజుల్లో మూడో దశ ట్రయల్స్ కు సన్నాహాలను భారీగా చేసునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించాయి. తమ కరోనాపై వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి జరగడంతో పాటు అవి బాగా పనిచేస్తున్నట్టు రెండో ధశ డేటాలో తేలిందని, మహమ్మారితో పోరులో తమ వ్యాక్సిన్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని సనోఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ థామస్ ట్రయంఫీ చెప్పారు. వేరియంట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచానికి మరిన్ని వ్యాక్సిన్లు అవసరమని చెప్పారు. సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకునే వ్యాక్సిన్లను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles