Man in Karnataka marries bride's minor sister too; held అక్కాచెలెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు అరెస్ట్..!

Shocking karnataka man marries 2 sisters at the same time

WEDDING SEASON, bizarre wedding, Groom, Bride, Marriage, man marries 2 sisters, double marriage, wedding news, bigamy, Kolar, Kurudumale, Sisters, wedding, Karnataka child marriage, Karnataka crime, Karnataka crime news, Karnataka news today, man marries two sisters, Karnataka crime news, Kolar crime, Kolar crime news, kolar news latest, Karnataka Police, child marriage, Karnataka news, CRIME

In a shocking incident, a 31-year-old man allegedly tied the knot with two sisters - one of them a minor who is differently abled - in Kolar district of Karnataka. The incident took place on May 7 but came to light on May 16 when the police arrested the man, identified as Umapathi, his parents, in-laws and a few other people under the Prohibition of Child Marriage Act, 2006.

అక్కాచెలెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు అరెస్ట్..!

Posted: 05/17/2021 09:07 PM IST
Shocking karnataka man marries 2 sisters at the same time

ఒక్క మగాడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం సాధ్యం కాకపోయినా.. ఎవరికీ అభ్యంతరం లేకపోతే మాత్రం వారి సంసార జీవితం సవ్యంగానే సాగిపోతుంది. ఇద్దర్ని పెళ్లాడడం కొత్త కాదు.. అది అంత వింత కూడా ఏమీ కాదు. అయితే కొందరు తుంటరులు మాత్రం ఇంట్లో ఇల్లాలు వున్నా మరోకచోట ప్రియురాలని పెట్టుకుని ఇద్దరితో రొమాన్స్ చేస్తుంటారు. ఇలాంటి వారు దొరకనంత సేపు దొరలే.. దొరికితే మాత్రం వీపు విమానం మోతే. అయితే, కర్ణాటకలో ఓ వధువు మాత్రం తన చెల్లిని పెళ్లి చేసుకుంటేనే.. తాను పెళ్లికి అంగీకరిస్తానని వరుడికి కండిషన్ పెట్టి మరీ ఒప్పించింది. ఇంకేముందు అమె మాట విన్న పాపానికి వరుడితో పాటు వధూవరుల బంధువులు కటకటాలపాలయ్యారు.

కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామానికి చెందిన నాగరాజప్ప, రాణెమ్మ దంపతులకు సుప్రియ, లలిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుప్రియకు పెళ్లి వయస్సు రావడంతో అమెకు స్థానికంగా వుండే బాగేపల్లి అనే గ్రామానికి చెందిన ఉమాపతి అనే యువకుడితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. దీంతో సుప్రియ వివాహం చేసుకుని వెళ్లిపోయిన తరువాత లలితకు భర్తగా ఎవరు వస్తారో.. ఎవరు ఆమెను చేసుకుంటారోనన్న అందోళన కుటుంబంలో నెలకొంది. ఎందుకంటే లలితకు చిన్ననాటి నుంచి మాటలు రావు, అలాగే చెవులు కూడా వినిపించవు. మూగ, బధిరురాలైన అమె జీవితం ఎలా సాగనుందో అన్న బెంగ అక్క సుప్రియను వేధించసాగింది.

దీంతో ఈ నెల 7న వారి పెళ్లి జరిగే సమయంలో.. వేదమంత్రోచ్చరణల మధ్య సరిగ్గా తాళిబోట్టు కట్టే సందర్భంగా సుప్రియ అడ్డుచెప్పింది. తన చెల్లెలి పరిస్థితి వివరించి, ఆమెను కూడా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటేనే తాను తాళి కట్టించుకుంటానని షరతు పెట్టింది. అక్కడి పెద్దలు మానవతాదృక్పథంతో వ్యవహరించి ఉమాపతికి నచ్చచెప్పడంతో, ఆ యువకుడు అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ తాళికట్టాడు.. ఒకే పెళ్లిలో అక్కాచెల్లెళ్లలను తన భార్యలను చేసుకున్నాడు. లాక్ డౌన్ కావడంతో పెద్దగా బంధువర్గం లేకుండా ఇరుగుపోరుగు వారితో వివాహాన్ని ముగించారు.

అయితే ఈ వార్త ఇవాళ దేశవ్యాప్తంగా దుమారం లేపింది. అనూహ్యరీతిలో పోలీసులు రంగప్రవేశం చేశారు. చిన్నదైన సుప్రియ చెల్లెలు లలితకు మైనారిటీ తీరకుండానే వివాహం చేశారని.. బాల్య వివాహ వ్యతిరేక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతటితో ఆగని పోలీసులు కొత్త పెళ్లి కొడుకైన ఉమాపతిని అరెస్టు చేశారు. తన తప్పేమి లేదని తనను అరెస్టు చేయడం భావ్యం కాదని ఉమాపతి పోలీసులకు వివరించాడు. లలితను పెళ్లి చేసుకుంటేనే తాను పెళ్లికి అంగీకరిస్తానని సుప్రియ ఒత్తిడి చేయడంతోనే తాను పెళ్లికి అంగీకరించానని, అప్పటికీ బంధువులలో పలువురు పెద్దమనుషులు ఒప్పించడంతో ఇలా జరిగిందని చెప్పడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles