'who is behind you.?' CID questions RRR రఘురామకృష్ణరాజు బెయిల్ పిటీషన్ 21కి వాయిదా వేసిన 'సుప్రీం'..

Ysrcp mp raghu rama krishna raju taken to cid office and questioned

Raghu Rama Krishna Raju, Narsapur MP, member of parliament Narsapur, Supreme Court, Bail plea, Justice Vineet Saran, Justice BR Gavai, Mukul Rohatgi, supreme court division bench, Hate Speeches, PV Sunil Kumar, Additonal DG CID, Conspiracy, media channels, AP CID, CM YS Jagan, YSRCP, CRPF Security, Andhra pradesh, CRIME

The Supreme Court on Monday directed that YSR Congress MP K Raghu Rama Krishna Raju, who has been arrested by Andhra Pradesh Police in a sedition case over his critical remarks, be taken to Army Hospital, Secunderabad for medical examination with respect to allegations of custodial torture.

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటీషన్ 21కి వాయిదా వేసిన ‘సుప్రీం’..

Posted: 05/17/2021 08:52 PM IST
Ysrcp mp raghu rama krishna raju taken to cid office and questioned

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాన్ని దారుణ విమర్శలు చేస్తూ కించపరుస్తున్నారన్న నేరారోపణలపై అరెస్టైయిన న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు బెయిల్ పిటీషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించిన సుప్రింకోర్టు.. అదే సమయంలో బెయిల్ పిటీషన్ పై సమాధానం ఇవ్వాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు తనను పోలీసులు కొట్టారన్న అభియోగాలపై ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తాజాగా అదేశాలను జారీ చేసింది.

తనను అరెస్టు చేసిన తరువాత అరికాళ్లు వాపులు వచ్చేలా తనను సిఐడీ పోలీసులు కోట్టారని ఆయన చేసిన అభియోగాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆయనను రాష్ట్ర హైకోర్టు నియమించే జుడిషియల్ అధికారి సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించి.. ఆయన శరీరంపై వున్న గాయాలను నోట్ చేయాలని అదేశించింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పలు సూచనలు కూడా చేసింది. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ అసుపత్రిలో ఇవాళే జుడీషిల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించాలని అదేశించారు.

రఘురామకృష్ణ రాజుకు నిర్వహించే వైద్యపరీక్షలను పూర్తిగా వీడియోగ్రఫీ తీయించాలని, ఇక వైద్యపరీక్షలకు సంబంధించిన రికార్డులన్నింటినీ న్యాయస్థానం ఎదుట సీల్డు కవర్ లో సమర్పించాలని అదేశించింది. ఇక ఈ వైద్య పరీక్షలకు అవసరమయ్యే పూర్తి వ్యయాన్ని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు భరించాలని న్యాయస్థానం అదేశించింది. ఇక తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయనను ఆసుపత్రిలోనే అడ్మిట్ చేయాలని.. ఆయన అసుపత్రి కాలాన్ని కూడా జుడీషియల్ కస్టడీ కిందే పరిగణిస్తామని న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది.

అంతకుముందు రఘురాజుకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టును ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు
చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురాజు పిటిషన్ వేశారని... అందుకే ఆయనపై కేసులు వేశారని... ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం నుంచి పలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన విమర్శలపై బదులు చెప్పాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆయనపై కేసులు బనాయించడం దారుణమని అన్నారు. రాజద్రోహం కింద కేసులు పెడితే న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తాయని.. మాత్రమే 124ఎ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles